20 ఏండ్లు ఒక లెక్క ఇప్పన్నుంచి మరో లెక్క.. ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న బన్నీ..

First Published | Mar 28, 2023, 12:06 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నేటితో ఇండస్ట్రీలో అడుగుపెట్టి విజయవంతంగా 20 ఏండ్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్, ఆడియెన్స్ కు హార్ట్ ఫెల్ట్ థ్యాంక్యూ నోట్ రాసుకొచ్చారు. 
 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా 20 ఏండ్ల సినీ కేరీర్ ను పూర్తి చేసుకున్నారు. 2003లో  డెబ్యూ ఫిల్మ్ ‘గంగోత్రి’తో  హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.  ఈ చిత్రానికి ప్రముఖ సీనియర్ దర్శకుడు కే రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. ఆయనకిది 100వ చిత్రం.  అల్లు అరవింద్, అశ్వినీ దత్ నిర్మించారు. 
 

అల్లు అర్జున్ - అదితి అగర్వాల్ జంటగా నటించిన ఈ బ్యూటీఫుల్ చిత్రం 2003 మార్చి 28న సరిగ్గా 20 ఏండ్ల కింద ఇదే రోజు విడుదైంది. బన్నీ హీరోగా పరిచయమై మంచి గుర్తింపు దక్కించుకున్న క్షణం అది. ‘గంగోత్రి’ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. 


‘గంగోత్రి’ చిత్రంతో మొదలైన బన్నీ కేరీర్ ప్రస్తుతం ఇండియాలోనే టాప్ హీరోల జాబితాలోకి చేరిపోయారు. 20 ఏండ్లలో 22 చిత్రాలతో  అలరించారు. సినిమా సినిమాకు ఇండస్ట్రీతో తనదైన ముద్రవేసుకుంటూ.. అభిమానులను సొంతం చేసుకుంటూ వచ్చారు. 
 

ఈ ప్రత్యేకమైన రోజును బన్నీ తాజాగా గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా  హార్ట్ ఫెల్ట్ నోట్ రాసుకొచ్చారు. ట్వీటర్ వేదికన ఆడియెన్స్,  తన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ ను విష్ చేస్తున్నారు. 

ట్వీట్ లో..  నేటితో నేను చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. మీ ఆశీర్వదం & ప్రేమతో నన్ను ముంచెత్తారు. పరిశ్రమకు చెందిన నా వారందరికీ నేను కృతజ్ఞుడను. అలాగే ప్రేక్షకులు, ఆరాధకులు మరియు అభిమానుల ప్రేమకు నేనే ఎప్పటికీ రుణపడి ఉంటాను.‘ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 
 

ఇక బన్నీ 2021లో వచ్చిన ‘పుష్ప : ది రైజ్’తో ఇండియా వైడ్ గా పాపులారిటీ సాధించుకున్నారు. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. దీంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇప్పటి నుంచి బన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలతో దుమ్ములేపనున్నారు. దీంతో 20 ఏండ్లు ఒక లెక్క.. ఇప్పట్నుంచి మరో లెక్కలా అల్లు అర్జున్ కేరీర్ ఉండబోతుందనడటంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుతం Pushpa The Ruleలో నటిస్తున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో నటించబోతున్నారు. 
 

Latest Videos

click me!