తెలుగులో 1000 కోట్ల బ్లాక్ బస్టర్ చిత్రం తెరకెక్కించిన డైరెక్టర్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ చేయబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి పరిచయం అవసరం లేదు. నాగ్ అశ్విన్ దర్శకుడిగా కేవలం 3 చిత్రాలని మాత్రమే తెరకెక్కించారు. కానీ పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు. ప్రభాస్ కల్కి 2898 ఎడి చిత్రంతో నాగ్ అశ్విన్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1100 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ఓ క్రేజీ స్టార్ తో భారీ చిత్రానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగ్ అశ్విన్ ప్రస్తుతం కల్కి 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నారు. అయితే, తాజాగా ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్తో సినిమా చేయబోతున్నారన్న వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచేస్తున్నాయి.
DID YOU KNOW ?
ఫ్లాప్ సినిమాతో మొదలు పెట్టి పాన్ ఇండియా క్రేజ్
డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన తొలి చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ చిత్రం నిరాశపరిచింది. ఆ తర్వాత మహానటి, కల్కి 2898 ఎడి చిత్రాలతో నాగ్ అశ్విన్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారారు.
25
రజినీకాంత్ తో నాగ్ అశ్విన్ మూవీ
ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి అతిరథ మహారథులని నాగ్ అశ్విన్ ఒక్క చోట చేర్చి కల్కి చిత్రం రూపొందించారు. ఇప్పుడు రజనీకాంత్‌తో ఆయన కాంబినేషన్ సెట్ అయినట్లు వస్తున్న వార్తలు ఫ్యాన్స్ లో ఉత్కంఠని పెంచుతున్నాయి. రీసెంట్ గా నాగ్ అశ్విన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ని కలిసి స్టోరీ ఐడియా వివరించారని, ఆయన దానిని ఎంతో ఇష్టపడ్డారని సమాచారం. ఆ కథను పూర్తిగా డెవలప్ చేయాలని రజనీకాంత్ కోరినట్టు తెలుస్తోంది.
35
అరుదైన ఘనత సాధించే అవకాశం
ఈ ప్రాజెక్టు కనుక ఓకె అయితే, చాలా రోజుల తర్వాత రజనీకాంత్ ఒక తెలుగు దర్శకుడితో సినిమా చేస్తున్నట్లు అవుతుంది. అలాగే, నాగ్ అశ్విన్ కూడా కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరితోనూ పని చేసిన కొద్దిమంది దర్శకుల్లో ఒకరిగా నిలుస్తారు. ప్రస్తుతం ఈ జాబితాలో లోకేష్ కనగరాజ్ ఉన్నారు.
భారీ స్థాయి కథాంశాలను ఎంచుకోవడంలో, కొత్త ప్రయోగాలు చేయడంలో నాగ్ అశ్విన్ ఎప్పుడూ ముందుంటారు. అందువల్ల రజనీకాంత్‌కు తగ్గ అద్భుతమైన పాత్రను ఆయన సృష్టిస్తారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా, నాగ్ అశ్విన్ తరచుగా వైజయంతి మూవీస్తో పనిచేస్తారు కాబట్టి, ఈ ప్రాజెక్ట్ కూడా అదే బ్యానర్‌లో రూపుదిద్దుకునే అవకాశాలు ఉన్నాయని టాక్.
55
కల్కి 2 ఆలస్యం అవుతుంది కాబట్టే..
అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయితే రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌పై స్పష్టమైన వివరాలు బయటకు వచ్చే అవకాశముందని సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ చిత్రాలని ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. దీనితో కల్కి 2 ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి లేదు. అందుకే నాగ్ అశ్విన్ ఈ గ్యాప్ లో మరో చిత్రం చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.