రెండు సార్లు గూస్ బంప్స్ మూమెంట్స్ మిస్ చేసిన నాగి.. ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్, అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ?

First Published Jun 28, 2024, 12:58 PM IST

నాగ్ అశ్విన్ ఒక్కసారిగా క్రేజీ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ప్రభాస్ 'కల్కి 2898 AD' చిత్రం సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. 

Kalki

నాగ్ అశ్విన్ ఒక్కసారిగా క్రేజీ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ప్రభాస్ 'కల్కి 2898 AD' చిత్రం సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. తొలి రోజు నుంచే కల్కి చిత్రం వసూళ్ల ప్రభంజనం మొదలు పెట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. 

మహాభారతాన్ని, కలియుగాన్ని లింక్ చేస్తూ కల్కి అవతారం నేపథ్యంలో నాగ్ అశ్విన్ అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ కథ రాసుకున్నారు. ఇది చాలా సాహసంతో కూడుకున్న పని. కానీ నాగ్ అశ్విన్ అద్భుతంగా డీల్ చేశాడు. ప్రతి అంశం గురించి పూర్తి క్లారిటీతో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ చేశారు. కల్కి భారీ విజయం దిశగా దూసుకుపోతుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

చివరి అరగంట అయితే ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ. అలాంటి గూస్ బంప్స్ మూమెంట్స్ తో నాగ్ అశ్విన్ అదరగొట్టేశాడు. అయితే ఫ్యాన్స్ మరో అంశంలో కాస్త నిరాశలో ఉన్నారు. మహాభారతం అంటే శ్రీకృష్ణుడి ప్రస్తావన లేకుండా ఉండదు. కల్కిలో ప్రధానంగా అశ్వథామని చూపించినప్పటికీ శ్రీకృష్ణుడి ప్రస్తావన కూడా ఉంటుంది. 

nag ashwin

ఆ సన్నివేశాన్ని నాగ్ అశ్విన్ చాలా చక్కగా చూపించారు. శ్రీకృష్ణుడు పాత్ర అంటే గుర్తుకు వచ్చేది సినిమాల్లో స్వర్గీయ ఎన్టీఆర్. కానీ ఈ చిత్రంలో నాగ్ అశ్విన్ ఓ చిన్న నటుడితో ఆ పాత్ర చేయించారు. కృష్ణ కుమార్ అనే తమిళ నటుడు కృష్ణుడి పాత్రలో నటించారు. అతడి స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. కానీ పేస్ చూపించకుండా నాగ్ అశ్విన్ ఆ పాత్రని చిత్రీకరించారు. 

nag ashwin

అయితే శ్రీకృష్ణుడి పాత్రతో సన్నివేశం చేస్తున్నప్పుడు స్టార్ హీరోనో, సీనియర్ హీరోనో పెట్టి ఉండాల్సింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ నాగ్ అశ్విన్  అంతకి మించిన భారీ ప్లానే వేశాడు. కల్కి చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ ని గ్రాఫిక్స్ ద్వారా కృష్ణుడిగా చూపించాలనుకున్నారట. ఆ మేరకు చర్చలు కూడా జరిగాయి. 

NTR

మీడియాకి కూడా లీకులు వచ్చాయి. కానీ నాగ్ అశ్విన్ సీనియర్ ఎన్టీఆర్ ని చూపించలేదు. కల్కి లాంటి భారీ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ కృష్ణుడిగా కనిపిస్తే ఎలా ఉండేది ? థియేటర్స్ తగలబడిపోయేంత రచ్చ రచ్చ జరిగేది. ఫ్యాన్స్ తప్పనిసరిగా గూస్ బంప్స్ ఫీల్ అయ్యేవారు. కానీ ఎందుకనో నాగ్ అశ్విన్ ఆ ఆలోచన విరమించుకున్నారు. 

అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ కృష్ణుడిగా చూపిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా వచ్చిందట. అది కూడా జరగలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఆ ప్రతిపాదనని రిజెక్ట్ చేశారా లేక నాగ్ అశ్విన్ ఆలోచన విరమించుకున్నారా అనేది క్లారిటీ లేదు. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ మహానటి చిత్రంలో తన తాత స్వర్గీయ ఎన్టీఆర్ పాత్రలో నటించడానికి అంగీకరించలేదు. నాగ్ అశ్విన్ ఒప్పించే ప్రయత్నం చేసినా కుదర్లేదు. 

మహానటిలో జూనియర్ ఎన్టీఆర్.. తన తాత గారి పాత్రలో నటించి ఉంటే అక్కడ కూడా గూస్ బంప్స్ వచ్చి ఉండేవి. జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకుంటే.. కీర్తి సురేష్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో చాలా సన్నివేశాలు తెరకెక్కించాలని నాగ్ అశ్విన్ అనుకున్నారట. మొత్తంగా తాతా మనవళ్లతో మ్యాజిక్ చేయాలనుకున్న నాగ్ అశ్విన్ కోరిక నెరవేరలేదు. 

Latest Videos

click me!