అందాల సునామీ నభా నటేష్‌ని భయపెట్టించిన సినిమా ఏదో తెలుసా?

Published : Sep 12, 2021, 04:59 PM IST

`ఇస్మార్ట్` భామ నభా నటేష్‌ హాట్‌ అందాలకు కేరాఫ్‌. ఇటీవల గ్లామర్‌ ఫోటోలతో ఇంటర్నెట్‌ని ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ భామ మాత్రం ఓ సినిమా విషయంలో భయపడిందట. ఆ విషయాలను తాజాగా పంచుకుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్‌ విషయాలను వెల్లడించింది.   

PREV
16
అందాల సునామీ నభా నటేష్‌ని భయపెట్టించిన సినిమా ఏదో తెలుసా?

నభా నటేష్‌ ప్రస్తుతం నితిన్‌ హీరోగా నటించిన `మ్యాస్ట్రో` చిత్రంలో నటించింది. తమన్నా కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు. శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి  నిర్మించారు. బాలీవుడ్‌ హిట్‌ మూవీ `అంధాదున్‌` రీమేక్‌. సెప్టెంబర్ 17న డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్‌లో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం నభా మీడియాతో ముచ్చటించింది. 

26

`
అంధాదున్` సినిమా విడుదలైనప్పుడు చూశాను. అది బాలీవుడ్‌కు టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా అని చెప్పుకోవచ్చు. అప్పట్లో `అంధాదున్` గురించి చాలా వినిపించింది. ఈ రీమేక్‌లో ఆఫర్ రావడంతో చాలా హ్యాపీగా అనిపించింది. జనాలు ఇప్పుడు  కొత్త సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి చిత్రంలో నాకు కూడా అవకాశం రావడం హ్యాపీగా అనిపించింది.  ఇది నా మొదటి రీమేక్ సినిమా. అది నాకు భయంగా అనిపించింది. రాధికా ఆప్టే అద్బుతంగా నటించింది. కానీ అది నేను ఎలా చేయగలను? అని భయం వేసింది. కానీ మళ్లీ సినిమా చూడకూడదు..ప్రభావితం అవుతాను అని అనుకున్నాను. 

36

కరోనా పీక్స్‌లో ఉన్న సమయంలోనే షూటింగ్ ప్రారంభించాం. మేమే మొదటగా సెట్‌కు వెళ్లామనుకుంటాను. అప్పుడు రెస్టారెంట్, పబ్ సీన్స్ చేశాం. ఎంతో మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు ఉండేవారు. షాట్ చేసేసి మేం పరిగెత్తే వాళ్లం. మా  జాగ్రత్తలు మేం తీసుకునేవాళ్లం. అంధుడిగా నితిన్ అద్భుతంగా నటించారు. మా సీన్స్, సాంగ్స్ బాగా వచ్చాయి. కరోనా సమయంలో నావి రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఇది మూడో సినిమా. ఇది వరకే నాకు ఓటీటీ భయం ఉండేది. ఏ సినిమా ఓటీటీలో వస్తుంది అని అనుకున్నాను. ఇంకా థియేటర్ల సమస్య ఉంది. కానీ ఇప్పుడు ఓటీటీలో అయితే అందరూ చూసేందుకు అవకాశం ఉంది.

46

కథను మాత్రం తీసుకుని దర్శకుడు తన విజన్‌తో సినిమాను తీశారు. దానికి దీనికి సంబంధం ఉండదు. నా పాత్రలో ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. తెలుగు చిత్రంలానే ఉంటుంది. కథలోని జీవం మాత్రం అలానే ఉంటుంది. రీమేక్ చేయడం ఇదే మొదటి సారి. కచ్చితంగా పోలికలు ఉంటాయి. మూవీ చూసిన తరువాత జనాలు ఎలాంటి రియాక్షన్ ఇస్తారనేది చూడాలి. నా పాత్రను ఒరిజినల్ దాంతో ఎలా పోలుస్తారు? అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. 

56

లాక్డౌన్ సమయంలో సినిమాలు చూడటమే నా పని. ఫస్ట్ వేవ్‌‌‌లో చాలా కంటెంట్ వచ్చింది. అన్ని భాషల చిత్రాలు చూశాను. కానీ ఈ సారి మాత్రం అంతగా కుదరలేదు. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాను. పైగా కంటెంట్ కూడా అంతగా రాలేదు. డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేశాను. కానీ కుదరలేదు. నేను బెంగళూరులో ఉంటున్నాను. రావడం వెళ్లడం.. ఈ కరోనా నిబంధనలు.. ఇలా టైం కుదరలేదు. అందుకే డబ్బింగ్ చెప్పలేకపోయాను. తదుపరి చిత్రాల్లో కచ్చితంగా డబ్బింగ్ చెబుతాను.

 

66

భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల గురించి అధికారికంగా ప్రకటించేంత వరకు ఇప్పుడే ఏమీ చెప్పలేను. అన్ని రకాల పాత్రలను చేయాలని ఉంది. అన్ని రకాల జానర్లలో సినిమాలు చేస్తున్నాను. అది నాకు చాలా ఆనందంగా ఉంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories