సాయి ధరమ్ తేజ్ కోసం తల్లడిల్లిపోతూ ఉపవాసం ఉంటున్న వృద్దులు.. పలుచోట్ల పూజలు

First Published Sep 12, 2021, 3:15 PM IST

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అపోలో ఆసుపత్రి వైద్యులు రెగ్యులర్ గా హెల్త్ బులిటెన్ విడుదలచేస్తూ సాయిధరమ్ తేజ్ ఆరోగ్య విషయాలు వెల్లడిస్తున్నారు.

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అపోలో ఆసుపత్రి వైద్యులు రెగ్యులర్ గా హెల్త్ బులిటెన్ విడుదలచేస్తూ సాయిధరమ్ తేజ్ ఆరోగ్య విషయాలు వెల్లడిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం మెరుగవుతున్నట్లు వైద్యులు ప్రకటించారు. 

అలాగే సాయిధరమ్ తేజ్ కాలర్ బోన్ సర్జరీ కూడా విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో తేజు కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు సాయిధరమ్ తేజ్ కోసం పూజలు నిర్వహిస్తున్నారు. 

ఇదిలా ఉండగా విజయవాడలో కొందరు వృద్దులు సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఉపవాసం ఉంటున్నారు. తేజు ప్రమాదానికి గురయ్యాడని తెలిసి తల్లడిల్లిపోతున్నారు. ఆ వృద్దులు సాయిధరమ్ తేజ్ పై అంతటి ప్రేమాభిమానాలు చూపడానికికారణం ఉంది. 

కొన్నేళ్ల క్రితం విజయవాడకు చెందిన అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ' వారు ఓల్డేజ్ హోమ్ భవనం నిర్మాణం కోసం ఎంతగానో విరాళాలకు ప్రయత్నించారు. నిలువ నీడలేని వృద్దులకు భవన నిర్మాణం కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసి సాయిధరమ్ తేజ్ వెంటనే రంగంలోకి దిగారు. 

భవనాన్ని తాను సొంత ఖర్చులతో నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం మెగా అభిమానుల సహాయంతో రెండంతస్తుల భవనం నిర్మించాడు తేజు. ఈ భవనంలోనే అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ తరుపున ఎందరో వృద్దులు ఆశ్రయం ఉంటున్నారు. 

అలా తమకు ఆశ్రయం కల్పించిన తేజు ప్రమాదానికి గురయ్యాడని తెలిసి ఆశ్రమం నిర్వాహకులు, వృద్దులు తల్లడిల్లిపోతున్నారు. ఉపవాసాలు ఉంటూ తేజు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానులు తేజు కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక పిఠాపురం, గోపాలపురం లాంటి ప్రాంతాల్లో సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, జనసేన కార్యకర్తలు పూజలు చేస్తున్నారు. ఇక తేజుకు చికిత్స కొనసాగుతోంది. తేజు ఆరోగ్యం మెరుగవుతోంది అని చెప్పిన వైద్యులు.. మరో 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచుతాం అని ప్రకటించారు.  

click me!