రాంచరణ్ ఫ్యాన్స్ కి షాకిచ్చిన శంకర్.. గేమ్ ఛేంజర్ లో అందరూ ఆశపడ్డ పాటనే లేపేశాడు

First Published | Jan 10, 2025, 7:34 AM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం థియేటర్స్ లో సందడి మొదలు పెట్టింది. శుక్రవారం తెల్లవారు జాము నుంచి ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. శంకర్ రేంజ్ సినిమా కాదు, కానీ పర్వాలేదు అనే టాక్ వస్తోంది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం థియేటర్స్ లో సందడి మొదలు పెట్టింది. శుక్రవారం తెల్లవారు జాము నుంచి ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. శంకర్ రేంజ్ సినిమా కాదు, కానీ పర్వాలేదు అనే టాక్ వస్తోంది. ముఖ్యంగా అప్పన్న పాత్రలో రాంచరణ్ జీవించాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో రానున్న రోజుల్లో చూడాలి. 

గేమ్ ఛేంజర్ చిత్రానికి బాలయ్య డాకు మహారాజ్, వెంకీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో కాంపిటీషన్ ఉంది. ఇదిలా ఉండగా శంకర్ ఇటీవల తెరకెక్కించిన చిత్రాలతో పోల్చితే గేమ్ ఛేంజర్ చాలా బెటర్ అని అంటున్నారు. శంకర్ వల్ల ఫ్యాన్స్ నిరాశ పడ్డ అంశాలు కూడా గేమ్ ఛేంజర్ లో ఉన్నాయి. 


గేమ్ ఛేంజర్ చిత్రంలో అన్నింటికంటే బాగా సూపర్ హిట్ అయిన సాంగ్ నానా హైరానా. శ్రేయ ఘోషల్, కార్తీక్ ఎంతో మధురంగా పాడిన ఆ మెలోడీ సాంగ్ మ్యూజిక్ లవర్స్ అందరిని ఆకట్టుకుంది. పాట అద్భుతంగా ఉంది కాబట్టి ఇక శంకర్ స్టైల్ లో చిత్రీకరణ ఇంకా క్రేజీగా ఉంటుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. స్క్రీన్ పై ఈ పాట విజువల్ ఫీస్ట్ లా ఉంటుందని అంతా భావించారు. 

కానీ శంకర్ చివరి నిమిషంలో  హ్యాండ్ ఇచ్చారు. నానా హైరానా సాంగ్ మొత్తాన్ని ఫైనల్ అవుట్ పుట్ నుంచి తొలగించారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రం ఆ సాంగ్ లేకుండానే ప్రదర్శించబడుతోంది. టెక్నికల్ కారణాల వల్ల మాత్రమే నానా హైరానా సాంగ్ ని తొలగించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇన్ఫ్రారెడ్ దృశ్యాల వల్ల సమస్య వచ్చిందట. దీనితో సాంగ్ ని ఎడిట్ చేయాల్సి వచ్చింది అని చిత్ర యూనిట్ పేర్కొంది. 

జనవరి 14 నుంచి ఆ సాంగ్ ని మూవీలో యాడ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. గేమ్ ఛేంజర్ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి, సూర్య, జయరామ్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటించారు. 

Latest Videos

click me!