అడ్వాన్స్ బుకింగ్స్ లో `గేమ్‌ ఛేంజర్‌`కి బిగ్‌ షాక్‌.. ప్రభాస్‌ టాప్‌, రామ్‌ చరణ్ పరిస్థితేంటి?

First Published | Jan 9, 2025, 10:49 PM IST

రామ్‌ చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న `గేమ్‌ ఛేంజర్‌`కి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో పెద్ద షాక్‌ తగులుతుంది. ఈ మూవీ ఏమాత్రం సత్తా చాటలేకపోతుంది. 
 

రామ్‌ చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందించిన ప్రతిష్టాత్మక మూవీ `గేమ్‌ ఛేంజర్‌`. దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఎస్‌ జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, నవీన్‌ చంద్ర, సముద్రఖని వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు.

పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది. మరికొన్ని గంటల్లో సినిమా భవితవ్యం తేలనుంది. రేపు(జనవరి 10) ఈ మూవీ విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే `గేమ్‌ ఛేంజర్‌` సినిమాకి సోషల్‌ మీడియాలో అంతా పాజిటివ్‌ పోస్ట్ లు కనిపిస్తున్నాయి. సినిమా బాగుందని చాలా మంది పోస్టులు పెడుతున్నారు. కానీ అవన్నీ పెయిడ్‌ పోస్ట్ లని తేలిపోతుంది. సినిమాకి పెద్దగా బజ్‌ లేకపోవడంతో అవన్నీ తేలిపోతున్నాయి.

సినిమా గురించి పెద్దగా చర్చించుకోవడం లేదు. చూడాలనే ఆసక్తి కామన్‌ ఆడియెన్స్ లో కనిపించడం లేదు. పాటలు హంటింగ్‌గా లేకపోవడం, ట్రైలర్‌ ఆకట్టుకునేలా లేకపోవడం, ఎగ్జైటింగ్‌ స్టఫ్‌ లేకపోవడంతో ఆడియెన్స్ నుంచి ఆసక్తి కనిపించడం లేదు. 


ఈ విషయం అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ తేలిపోతుంది. `గేమ్‌ ఛేంజర్‌` అడ్వాన్స్ బుకింగ్స్ లో ఏమాత్రం ప్రభావం చూపించడం లేదు. ప్రభాస్‌, అల్లు అర్జున్‌ సినిమాలతో పోల్చితే రామ్‌ చరణ్‌ ఆ రేంజ్‌లో సత్తా చాటలేకపోతున్నారు. ఎన్టీఆర్‌ సైతం `దేవర`తో తన బెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సాధించారు.

కానీ వారితోపోల్చితే `గేమ్‌ ఛేంజర్‌` చాలా వెనకబడిపోయింది. ఏమాత్రం ప్రభావం చూపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ లో ప్రభాస్‌ నటించిన `కల్కి`, `సలార్‌`, అల్లు అర్జున్‌ `పుష్ప 2`, ఎన్టీఆర్‌ `దేవర` చిత్రాలు ముందు వరుసలా ఉన్నాయి. రామ్‌ చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌` చివరి స్థానంలో నిలిచింది. 

ఏపీ తెలంగాణలోనూ ఇది ఏమాత్రం సత్తా చాటలేకపోతుంది. నెల్లూరులో మాత్రం దుమ్మురేపుతుంది. అక్కడ 103 షోస్‌కి 1.15కోట్ల గ్రాస్‌ సాధించింది. కానీ మరెక్కడా ఆ ప్రభావం కనిపించడం లేదు. తెలంగాణలో `కల్కి2898 ఏడీ`97శాతంతో ముందు వరుసలో ఉంది.

`సలార్‌`93శాతంతో రెండో స్థానంలో, `పుష్ప 2`91శాతంతో మూడో స్థానంలో `దేవర` 88 శాతంతో నాల్గో స్థానంలో ఉంటే. `గేమ్‌ ఛేంజర్‌` కేవలం 38శాతం మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. ఇది ఒక్క రోజు ముందు బుకింగ్స్ కావడం గమనార్హం. 

ఆంధ్రాలో 97శాతం అడ్వాన్స్ బుకింగ్స్ తో `సలార్‌` మొదటి స్థానంలో ఉంటే 92శాతంతో ఎన్టీఆర్‌ `దేవర`, 89శాతంతో ప్రభాస్‌ `కల్కి 2898 ఏడీ` మూడో స్థానంలో, 74శాతంతో `పుష్ప 2` నాల్గో స్థౠనంలో ఉంటే. 52శాతంత `గేమ్‌ ఛేంజర్‌` చివరి స్థానంలో నిలిచింది. ఇదే కాదు హిందీలోనూ అలాంటి పరిస్థితి ఉంది. హిందీలోనూ చివరి స్థానంలో `గేమ్‌ ఛేంజర్‌` ఉంది.

నార్త్ అమెరికాలో కూడా `కల్కి`, `ఆర్‌ఆర్‌ఆర్‌`, `దేవర`, `పుష్ప 2` టాప్‌లో ఉన్నాయి. ఆ తర్వాత `గేమ్‌ ఛేంజర్‌` ఉంది. బుక్‌ మై షోలో `పుష్ప 2` టాప్‌లో ఉంది. రెండో స్థానంలో `కల్కి`, మూడో స్థానంలో `సలార్‌`, నాలుగు `దేవర`, ఐదు `గుంటూరు కారం`, ఉండగా, చివరగా `గేమ్‌ ఛేంజర్‌` నిలిచింది. 
 

ఇండియా వైడ్‌గా ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ కేవలం 20-30శాతం మాత్రమే ఉండటం ఆశ్చర్యపరుస్తుంది. సోషల్‌ మీడియాలో పాజిటివ్‌ పోస్టులున్నా, అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇది ఏమాత్రం సత్తా చాటలేకపోతుంది. ఇప్పటి వరకు ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ లో ప్రపంచ వ్యాప్తంగా రూ.40-50కోట్ల వరకు రాబట్టిందని టాక్‌.

అదే `పుష్ప 2` రూ.167కోట్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన `గేమ్‌ ఛేంజర్‌` చాలా వెనకబడి పోయింది. మరి సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తే తప్ప ఈ మూవీ కోలుకోవడం కష్టమనే టాక్‌ ట్రేడ్‌ పండితుల నుంచి వినిపిస్తున్న టాక్‌. 
 

`గేమ్‌ ఛేంజర్‌` ప్రపంచ వ్యాప్తంగా రూ. 221కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అయ్యింది. నైజాంలో 36కోట్లు, సీడెడ్‌లో 23కోట్లు, ఆంధ్రాలో 72కోట్ల వరకు బిజినెస్‌ అయ్యిందని సమాచారం. హిందీలో 43కోట్లు, ఓవర్సీస్‌లో 25కోట్లు వ్యాపారం జరిగింది. ఈ లెక్కన ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ కావలంటే సుమారు 450కోట్ల గ్రాస్‌ రావాలి.

ఈ మూవీకి బడ్జెట్‌ కూడా రూ.450కోట్లు అని టాక్. ఓటీటీ ద్వారా మరో రూ.110కోట్లు వచ్చాయట. అంటే నిర్మాత దిల్‌ రాజు లాభాల్లోకి రావాలంటే ఈ మూవీ మినిమమ్‌ 800-1000 కోట్లు అయినా చేయాలి. అప్పుడే అంతా సేఫ్‌. లేదంటే నష్టాలు తప్పవు. మరి ఏ రేంజ్‌లో సత్తా చాటుతుందో చూడాలి. 

read more: `గేమ్‌ ఛేంజర్‌` అసలు స్టోరీ ఇదే, వీక్‌ పాయింట్స్, హైలైట్స్ ఏంటి? బజ్‌ లేకపోవడానికి కారణమేంటి?

also read:  తనకి ఎదురైన అనుభవం, కూతురికి పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్న రాంచరణ్.. ఎవ్వరూ ఊహించనిది
 

Latest Videos

click me!