`నా సామిరంగ` కలెక్షన్లు.. ఫస్ట్ డే అంత తక్కువా.. సంక్రాంతికి వస్తే తప్ప నాగార్జునకి హిట్‌ రాదా?

First Published Jan 15, 2024, 12:53 PM IST

నాగార్జున నటించిన `నా సామిరంగ` మూవీ ఆదివారం విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఫస్ట్ డే కలెక్షన్లు వచ్చాయి. అదే సమయంలో నాగ్‌పై పలు ఆసక్తికర కామెంట్లు వినిపిస్తున్నాయి. 
 

కింగ్‌ నాగార్జున.. ఈ సంక్రాంతికి `నా సామిరంగ` సినిమాతో వచ్చాడు. పక్కాగా పండక్కి సెట్‌ అయ్యే కమర్షియల్‌ మూవీతో వచ్చారు. ఆరు పాటలు, మూడు ఫైట్లు అనే కాన్సెప్ట్ తో వచ్చారు. ఈ మూవీ ప్రధానంగా పండగ ఎలిమెంట్లతో తెరకెక్కింది. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఊర్లో గోడవల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ మూవీకి పాజిటివ్‌ వచ్చింది. పండగ ఎలిమెంట్లు ఉండటంతో ఈ రెండు మూడు రోజులు ఆడే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే ఈ మూవీకి తొలి రోజు డల్‌గా ఓపెనింగ్స్ ని రాబట్టింది. అప్‌ కమింగ్‌ హీరో సినిమాల రేంజ్‌లోనే నాగార్జున మూవీ కలెక్షన్లు ఉండటం గమనార్హం. ఈ మూవీ కేవలం 8.6కోట్ల గ్రాస్‌ మాత్రమే రాబట్టింది. షేర్‌ కేవలం నాలుగు కోట్లకే పరిమితమయ్యింది. ఈ మూవీ 18కోట్ల బిజినెస్‌ జరిగింది. సంక్రాంతి సినిమాల్లో ఇదే తక్కువ బిజినెస్‌ జరిగింది. నాగ్‌ సినిమాలు గతంలో ఆడకపోవడంతో ఈ మూవీకి పెద్దగా బిజినెస్‌ జరగలేదు. 
 

Latest Videos


దీంతో 19 కోట్ల బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌తో థియేటర్లోకి వచ్చింది `నా సామిరంగ`. ఈ మూవీ ఈ రోజు, రేపు వరకు ఆడుతుంది. ఏమైనా ఈ రెండు రోజుల్లోనే ఈ మూవీ కలెక్ట్ చేయాలి. లేదంటే బయ్యర్లకి నష్టాలు తప్పవు. ఎందుకంటే ఇది యూనివర్సల్‌ కంటెంట్‌ కాదు, కేవలం సంక్రాంతి పండగ కంటెంట్‌ మాత్రమే. పండగ అయిపోతే దీన్ని ఎవరూ పట్టించుకోరు. మరి లాంగ్‌ రన్‌లో ఇది బ్రేక్‌ ఈవెన్‌ అవుతుందా అనేది చూడాలి. 

ఇక నాగార్జునకి ఇటీవల విజయాలు లేవు. `సోగ్గాడే చిన్ని నాయన` మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. 2015లో ఈ మూవీ వచ్చింది. ఆ తర్వాత ఆయనకు సక్సెస్‌ లేదు. ఆయనకు చాలా సినిమాలు చేసినా ఏదీ వర్కౌట్‌ కాలేదు. యాక్షన్‌ మూవీస్‌, హర్రర్‌ ఫిల్మ్, మాస్‌ మూవీస్‌ చేశారు. థ్రిల్లర్‌ కూడా చేశాడు. ఏదీ మెప్పించకలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆయన మలయాళ మూవీని రీమేక్‌ చేశారు. `నా సామిరంగ` మలయాళంలో విజయం సాధించిన `పొరింజు మరియం జోస్‌` అనే మూవీని తెలుగులో రీమేక్‌ చేశారు. 
 

ఈ మూవీ సంక్రాంతికి రావడంతోనే అంతో ఇంతో ఆడుతుంది. లేదంటే ఆడే మూవీ కాదు. అయితే ఈ సందర్భంగా ఓ విషయం క్లారిటీ వచ్చింది. ఆయన సంక్రాతికి వస్తే తప్ప హిట్‌ రాదా అనేది చర్చనీయాంశం అవుతుంది. ఆయన  సంక్రాంతికి  వచ్చిన సినిమాలు మాత్రమే ఆడాయి,  పైగా అలాంటి కంటెంట్‌ ఉన్న చిత్రాలే మెప్పించాయి, మిగిలినవి ఆడలేదు. దీంతో నాగ్‌కి సంక్రాంతికి వస్తే తప్ప  హిట్‌ రాదా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

ఇక నాగార్జున హీరోగా నటించిన `నా సామిరంగ` మూవీలో అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ కీలక పాత్రలు పోషించారు. ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా చేసింది. కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్ని దర్శకత్వం వహించారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ఈ మూవీ రూపొందింది. ఆదివారం విడుదలైంది. 
 

click me!