కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ నా సామిరంగ. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భోగి పండుగ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. సంక్రాంతికి ఎన్ని సినిమాలైనా ఆడేస్తాయి అనే నమ్మకంతో నాగార్జున సరిగ్గా సంక్రాంతికి తన చిత్రాన్ని వదిలాడు.
సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ లాంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నప్పటికీ నాగార్జున వెనక్కి తగ్గలేదు. తన సినిమాలో పర్ఫెక్ట్ గా పండగ మెటీరియల్ ఉందని నా సామిరంగ టీం మొత్తం నమ్మింది. చివరికి నాగార్జున నమ్మకమే గెలిచింది.
తొలి షో నుంచే నా సామిరంగ చిత్రానికి నెగిటివ్ టాక్ మొదలయింది. అయినప్పటికీ వారం రోజుల లోపే నా సామిరంగ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ట్రేడ్ కి ఊహించని షాక్ ఇచ్చింది. ఇంత నెగిటివ్ టాక్ లో కూడా బ్రేక్ ఈవెన్ నా సామి రంగ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్లకు లాభాలు తెచ్చిపెడుతోంది.
ఈ చిత్రంలో నాగార్జున సరసన హీరోయిన్ ఆషిక రంగనాథ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆషిక రంగనాథ్ పాత్ర పెద్ద ప్లస్ అయింది. నా సామిరంగ చిత్ర విజయంలో ఆమె పాత్ర ఎంతైనా ఉంది.
పల్లెటూరి అమ్మాయిలా ఒదిగిపోయి ఎంతో అందంగా నటించింది. లంగా ఓణిలో, చీరకట్టులో అదరహో అనిపించింది. ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఈ యంగ్ బ్యూటీ సొగసుకి యువత ఫిదా అవుతున్నారు.
తాజాగా ఆషిక డిజైనర్ లంగా ఓణిలో ఎంతో అందంగా అల్లరిపిల్లలా ఇస్తున్న ఫోజులు చూడ ముచ్చటగా ఉన్నాయి. ఆషిక కుందనపు బొమ్మలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.