మలయాళం, తమిళ చిత్రాలతో యంగ్ హీరోయిన్ మిర్నా మీనన్ ప్రేక్షకులను అలరించింది. తెలుగులోనూ ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించింది. ఆది సాయి కుమార్ సరసన ‘క్రేజీ ఫెలోస్’, అల్లరి నరేశ్ సరసన ’ఉగ్రం’లో ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించింది. కానీ ఆ చిత్రాలతో మలయాళీ ముద్దుగుమ్మకు పెద్దగా గుర్తింపు రాలేదు.