Naa Anveshana: సినిమా రివ్యూలు ఇచ్చే యూట్యూబర్లపై.. స్టార్ ట్రావెల్ వ్లాగర్.. అన్వేష్ సంచలన కామెంట్స్ చేశారు. రివ్యూలు మానేసి వారు ఏం చేయాలో క్లియర్ కట్ గా సలహాలు కూడా ఇచ్చాడు. ఇంతకీ అన్వేష్ ఏమంటున్నాడంటే?
తెలుగులో ఎక్కువ మంది ఫాలో అవుతున్న ట్రావెల్ వ్లాగర్లలో అన్వేష్ ముందున్నాడు. యూట్యూబ్ ట్రావెలర్స్ కు అతను రోల్ మోడల్, సెలబ్రిటీ కూడా. అన్వేష్ కు సినిమా స్టార్స్ కు ఉన్నంత ఇమేజ్, ఫాలోయింగ్ ఉంది. ఈక్రమంలో అతను అప్పుడుప్పుడు చేసే కామెంట్స్ పై కూడా విమర్శలు వస్తుంటాయి. ముఖ్యంగా అతను వాడే భాషపై అభ్యంతరాలు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈమధ్య కాలంలో అన్వేష్ మహిళల వస్త్రధారణపై చెలరేగిన వివాదం ఎంత రచ్చ జరిగిందో అందరికి తెలిసిందే. ఇప్పటికీ ఏదో ఒక రకంగా తన వీడియోలతో వివాదం అవుతూనే ఉన్నాడు అన్వేష్. ఇక రీసెంట్ గా ఓ వీడియో ద్వారా యూట్యూబర్లపై చేసిన కామెంట్స్ రచ్చ రచ్చ చేస్తున్నాయి.
25
సినిమా రివ్యూలు చేయొద్దన్న అన్వేష్..
నేటి సోషల్ మీడియా ప్రపంచంలో వ్యూస్, ఆదాయం కోసం యూట్యూబర్లు ఎంచుకుంటున్న మార్గాలు, ఎదుర్కొంటున్న చట్టపరమైన సవాళ్లపై 'నా అన్వేషణ' అన్వేష్ సంచలన కామెంట్స్ చేశాడు. రివ్యూలు ఇచ్చే యూట్యూబర్లకు ఆయన ఓ రకమైన వార్నింగ్ ఇచ్చాడు. పలు సూచనలు కూడా చేశాడు. సినిమా రివ్యూల వెనుక పడి లీగల్ సమస్యల్లో చిక్కుకోవద్దని, దానికి బదులుగా మంచి కంటెంట్ ఎంచుకుని ఆదాయం ఎలా సంపాదించవచ్చో తన శైలిలో పంచ్ లతో వివరించారు.
35
యూట్యూబర్లను హెచ్చరించిన అన్వేష్..
ఆరు నెలల క్రితమే సినిమా రివ్యూలు చేయవద్దని హెచ్చరించిన విషయాన్ని అన్వేష్ గుర్తుచేశారు. వందల, వేల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీసే భారీ నిర్మాతలు, దర్శకులు లీగల్ చర్యలకు దిగితే సాధారణ యూట్యూబర్లు కోర్టు కేసులు తట్టుకోవడం సాధ్యం కాదని అన్వేష్ అన్నాడు. ఇప్పటికే కొందరు రివ్యూయర్లపై అనేక కేసులు నమోదయ్యాయని, కాబట్టి రివ్యూల గ్యాంగ్ తమ పంథాను మార్చుకోవాలని సూచించారు.
సోషల్ మీడియాలో సక్సెస్ సాధించడానికి కొందరు క్రియేటర్లు ఎంచుకుంటున్న కొత్త వ్యూహాలను అన్వేష్ ఉదాహరణలతో ఎత్తిచూపారు గతంలో చిల్లర కంటెంట్ చేసినవారు కూడా ఇప్పుడు వ్యూహం మార్చి, వీడియోల ముందు 'జై శ్రీరామ్', చివరన 'జై హింద్' అంటూ దేశభక్తి, ధార్మిక విషయాలు ప్రచారం చేయడం ద్వారా నెలకు రూ. 20 లక్షలు ఈజీగా సంపాదిస్తున్నారని సంచలన కామెంట్స్ చేశాడు అన్వేష్. ఇవి కాక అడవులు, వింతలు లేదా ఆసక్తికరమైన విషయాలపై కంటెంట్ తయారుచేస్తూ లక్షల్లో ఆర్జిస్తున్నారని అన్వేష్ అన్నాడు.
55
ఇన్ఫర్మేషన్ & హిస్టరీ కంటెంట్‌తో భారీ ఆదాయం
కేవలం ఒక చోట కూర్చుని ఆసక్తికరమైన చరిత్ర చెప్పడం ద్వారా లేదా స్కామ్‌ల గురించి చెప్పడం ద్వారా కూడా భారీగా సంపాదించవచ్చని అన్వేష్ తన సొంత అనుభవాన్ని పంచుకున్నాడు.
తాను హర్షద్ మెహతా స్కామ్ గురించి చెపితే 10 లక్షల మంది చూశారని.. ఆ వీడియోకి రూ. 3 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. అంతే కాదు. విజయ్ మాల్యా కథ గురించి వీడియో చేస్తే.. 1 లక్ష వరకు సంపాదించానన్నాడు. ఇక మహాభారతం కథనాలు గురించి చేసిన వీడియో తనకు 4 లక్షల ఆదాయం తెచ్చిపెట్టినట్టు అన్వేష్ వెల్లడించాడు.
బెట్టింగ్ ప్రోమోషన్ల వల్ల నష్టాలు..
అడ్డదారిలో వేగంగా డబ్బు సంపాదించడానికి బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసిన పెద్ద పెద్ద యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లతో పాటు క్రికెటర్ల బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అయిపోయాయని అన్వేష్ స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ ప్రచారాల వల్ల జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరించారు. అన్వేష్ తన మార్క్ భాషను వాడుతూ చేసిన ఈ వీడియో వైరల్ అయ్యింది. సినిమా రివ్యూలు లేదా బెట్టింగ్ యాప్‌ల ప్రచారాల జోలికి వెళ్లకుండా, ప్రేక్షకులు ఇష్టపడే జ్ఞానాన్ని, సమాచారాన్ని అందించే కంటెంట్‌ను ఎంచుకోవాలని అన్వేష్ పిలుపునిచ్చారు. కొంత మంది అతనికి సపోర్ట్ గా కామెంట్స్ పెట్టగా.. మరికొంత మంది మాత్రం తిట్టిపోస్తున్నారు.