‘సరిపోదా శనివారం’బ్రేక్ ఈవెన్ అయ్యిందా? కలెక్షన్స్ పరిస్దితి ఏంటి

First Published | Sep 9, 2024, 7:25 AM IST

‘సరిపోదా శనివారం’ లాంటి డిఫరెంట్ యాక్షన్ జోనర్ కథను ఎంపిక చేసుకున్నారు నాని.  ఈ సినిమాకు సెకండ్  వీకెండ్ రూపంలో ఇంకో పెద్ద అవకాశం దొరికింది,. 

Nani, Saripodhaa Sanivaaram,


  నాని 31వ సినిమా  ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)రిలీజ్  అయ్యి మంచి హిట్ టాక్ తెచ్చుకున్న  సంగతి తెలిసిందే.  ఈ సినిమా రెండో వారంలోకి ప్రవేశించింది. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రం విడుదల అయ్యిన వారంలో  తుఫానులు, వరదలతో రెండు తెలుగు రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి.

ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా సినిమా కలెక్షన్స్ పై పడుతోంది. అయితే దాన్ని సైతం తట్టుకుని సినిమా నిలబడిందని ట్రేడ్ అంటోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కలెక్షన్స్ ఎలా ఉన్నాయి  బ్రేక్ ఈవెన్ అయ్యిందా

Nani, Saripodhaa Sanivaaram


వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దసరా మరియు హాయ్ నాన్న వంటి హిట్ల తర్వాత, నాని ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని ఆశ పడుతున్నారు . నాని కోరిక తీరేటట్లే కనపుడుతోంది. మరీ దసరా  స్దాయి కనపడకపోయినా కలెక్షన్స్ బాగున్నాయి.  10వ రోజు వినాయక చవితి హాలిడే అడ్వాంటేజ్ తో మాస్ రచ్చ చేసి అంచనాలను మించి కలెక్షన్స్ ని అందుకుంది.


Saripodhaa Sanivaaram review


ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజు సండే అడ్వాంటేజ్ కలిసి వచ్చింది. దాంతో ఆంధ్రలో వర్షాల వలన ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా మరోసారి ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెట్టింది.నైట్ షోలకు నైజాంలో  డ్రాప్ కవపడినా ఆంధ్రలో  ఉన్నంతలో బాగానే హోల్డ్ ని చూపెడుతూ ఉండగా మొత్తం మీద బ్రేక్ ఈవెన్ అయ్యింది. 

Saripodhaa Sanivaaram


రూ.45 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ తో విడుదల అయిన ఈ సినిమాకు ఆ స్థాయి వసూళ్లు వస్తాయా అనే డౌట్స్ వచ్చాయి.  అయితే రెండో వారంలో పెద్దగా పోటీ లేక పోవడంతో కలెక్షన్స్ కంటిన్యూ అయ్యాయి. రెండో శనివారం కూడా 'సరిపోదా శనివారం' సినిమాకు మంచి వసూళ్లు దక్కటం కలిసొచ్చింది.

దాంతో బ్రేక్‌ ఈవెన్‌ కలెక్షన్స్ ను ఈ సినిమా చేరుకుంది. మొదటి పది రోజుల్లోనే సరిపోదా శనివారం సినిమాకు బ్రేక్‌ ఈవెన్ సాధ్యం అవ్వడంతో రాబోయే వారం రోజుల్లో లాభాల పంట పండే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Actor Nani starrer new film titled Saripodha Sanivaaram

ఈ వారం మార్కెట్ లో నాని సినిమాకు పోటీ కనపడటం లేదు. విజయ్ గోట్ సినిమా అంత ఇంపాక్ట్ చూపించటం లేదు. అలాగే రానా సమర్పించిన  35 చిన్న కథ కాదుకి మంచి రెస్పాన్స్  వస్తున్నా మాస్ సెంటర్స్ లో  వర్కవుట్ అయ్యే అవకాసం లేదంటున్నారు. ఈ సినిమాకు మల్టీప్లెక్సుల్లో రెస్పాన్స్ చాలా బాగుంది.

అలాగే దిల్ రాజు నిర్మించిన జనక అయితే గనక ఈ వారం తప్పుకోవడంతో దానికి రిజర్వ్ చేసిన స్క్రీన్లు కొన్ని నాని  తిరిగి  రావటం కలిసొస్తోంది. దానికి తోడు హైదరాబాద్ లో విజయ వేడుక నిర్వహించి సినిమాని జనాల్లో నానేలా చేస్తున్నారు నాని.   


‘సరిపోదా శనివారం’సినిమాలో ఎస్.జె.సూర్య కీలకపాత్ర పోషించడం విశేషం. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించారు.  ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. ఇక ఈ చిత్రానికి మురళి జి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ‘దసరా’ లాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న మాస్, రగ్డ్ మూవీ తర్వాత.. ‘హాయ్ నాన్న’ అనే క్లాస్, ఫీల్ గుడ్ స్టోరీని నాని ఎంచుకున్నారు. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ లాంటి డిఫరెంట్ యాక్షన్ జోనర్ కథను ఎంపిక చేసుకున్నారు.
 

Latest Videos

click me!