నీకు సామాన్లు మెసేజ్ పెడతాను మీ ఇద్దరూ కలిపి తీసుకురండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రేవతి. విషయం తెలుసుకున్న కృష్ణ, రేవతి అత్తయ్య ఈమధ్య విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు ఏంటి భవాని అత్తయ్య లాగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు అంటుంది. మన అగ్రిమెంట్స్ మ్యారేజ్ సంగతి అమ్మకి తెలుసని నీకు ఎలా చెప్పాలి అనుకుంటాడు మురారి. నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పండి మీరు అత్తయ్య నా దగ్గర ఏదో దాయాలని చూస్తున్నారు అది ఏంటి అని నిలదీస్తుంది కృష్ణ.