చిరంజీవి విషయంలో పప్పులో కాలేసిన కృష్ణం రాజు, అల్లు అరవింద్.. ఆయన దూరదృష్టి మాత్రం మైండ్ బ్లోయింగ్

First Published Apr 23, 2024, 11:15 AM IST

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కృష్ణ, శోభన్ బాబు, మురళి మోహన్, కృష్ణం రాజు లాంటి హీరోలకు జూనియర్. అప్పట్లో చిరంజీవి ట్యాలెంట్ ని బాగా గుర్తించిన వారిలో కృష్ణం రాజు, మురళి మోహన్ ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కృష్ణ, శోభన్ బాబు, మురళి మోహన్, కృష్ణం రాజు లాంటి హీరోలకు జూనియర్. అప్పట్లో చిరంజీవి ట్యాలెంట్ ని బాగా గుర్తించిన వారిలో కృష్ణం రాజు, మురళి మోహన్ ఉన్నారు. వీళ్ళిద్దరితో చిరంజీవికి బాగా చనువు ఉండేదట. కృష్ణంరాజు, చిరంజీవి ఒకే ఊరు మొగల్తూరు నుంచి ఇండస్ట్రీకి వచ్చారు. 

చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కొన్ని నెగిటివ్ రోల్స్ చేశారు. చిరంజీవి సెట్స్ లో సరదాగా ఉన్నప్పుడు.. ఏ పాట అయినా పెట్టండి నేను డ్యాన్స్ వేస్తా అని చెప్పేవారట. హిందీ పాట అయినా సరే రిథమిక్ గా డ్యాన్స్ చేసేవారు. చిరంజీవి ఉత్సాహం, కళ్ళల్లో ఆ పవర్ చూసి కృష్ణం రాజు ఒక మాట అన్నారని మురళి మోహన్ తెలిపారు. 

చిరంజీవికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటేంటే అతని కళ్ళు. కోపంగా చూశాడంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వీడు ఇండస్ట్రీలో మంచి విలన్ అవుతాడయ్యా.. ఆ కసి ఉంది అని కృష్ణంరాజు నాతో ఒకరోజు అన్నారు. ఇండస్ట్రీలో విలన్ కావడం ఏంటి అండీ.. ఇండస్ట్రీకే మొగుడు అవుతాడు చూడండి అని తాను చెప్పినట్లు మురళి మోహన్ అన్నారు. దీనితో మురళి మోహన్ దూరదృష్టికి హ్యాట్సాఫ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

చిరంజీవి ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే చిరంజీవి టాప్ హీరో అవుతాడని తాను అంచనా వేసినట్లు మురళి మోహన్ అన్నారు. కృష్ణం రాజు మాత్రమే కాదు.. అల్లు అరవింద్ కూడా చిరంజీవిని తప్పుగా అంచనా వేశారట.  తమ సోదరి సురేఖని చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు.. అల్లు అరవింద్.. చిరంజీవి మంచి విలన్ అవుతాడని ఊహించారట. 

కానీ చిరంజీవి దశాబ్దాల పాటు టాలీవుడ్ లో ఏలే అగ్ర హీరో అయ్యారు. చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చాక డ్యాన్సులు, ఫైట్స్ అన్నీ మారిపోయాయి. అంతకు ముందు మేము చేసిన డ్యాన్సులు, ఫైట్స్ వేరు.. చిరంజీవి వాటన్నింటినీ పూర్తిగా మార్చేశారు. అందుకే టాలీవుడ్ చిరంజీవికి ముందు చిరంజీవికి తర్వాత అని చెప్పొచ్చు అంటూ మురళి మోహన్ ప్రశంసలు కురిపించారు. 

ఇక చిరంజీవికి, తనకి మధ్య ఎప్పుడూ కులం ప్రస్తావన రాలేదని మురళి మోహన్ అన్నారు. చిరంజీవితోనా కాదు తాను ఎప్పుడూ ఎవరితోనూ కులం గురించి చర్చించలేదని మురళి మోహన్ అన్నారు. 

click me!