ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావుని డామినేట్ చేసిన నటి, సావిత్రి కాదు..చనిపోతే ఒక్కరు కూడా వెళ్ళలేదు

కొన్నిసార్లు చిత్ర పరిశ్రమలో ఎంత ప్రతిభ ప్రదర్శించినా దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కదు. చిత్ర రంగంలో తిరుగులేని నటన కనబరిచిన కొందరు నటీనటులు.. వారి సాటి నటీనటులతో పోల్చుకుంటే మరుగున పడిపోయారు.

కొన్నిసార్లు చిత్ర పరిశ్రమలో ఎంత ప్రతిభ ప్రదర్శించినా దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కదు. చిత్ర రంగంలో తిరుగులేని నటన కనబరిచిన కొందరు నటీనటులు.. వారి సాటి నటీనటులతో పోల్చుకుంటే మరుగున పడిపోయారు. అలనాటి వారిలో అప్పటి దిగ్గజ నటి సూర్యకాంతం ఒకరు. 

సూర్య కాంతం కాకినాడలో పుట్టి పెరిగిన నటి. 1924లో ఆమె జన్మించారు. చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. సూర్యకాంతం అంటే వెండితెరపై గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరు. ఆ తరహా పాత్రలకు అప్పట్లో ఆమెకి పోటీగా ఎవరూ ఉండేవారు. ఒకవేళ ఉన్నా సూర్యకాంతం తరహాలో నటించి మెప్పించడం కష్టం. ఆమెని అభిమానులు గుర్తుంచుకున్నారు కానీ.. చిత్ర పరిశ్రమ, ప్రభుత్వాలు గుర్తించాల్సిన స్థాయిలో గురించలేదు అని అంటుంటారు. 


సీనియర్ నటుడు మురళి మోహన్ ఓ ఇంటర్వ్యూలో సూర్యకాంతం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సూర్యకాంతం, సావిత్రి లాంటి మహానటీమణులతో కలసి నటించాలని తెలిపారు. సాధారణంగా ఇండస్ట్రీలో ఒక మాట అంటుంటారు. ఎస్వీ రంగారావు సీన్ లో ఉంటే ఆయన డామినేషన్ ని ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ తట్టుకోలేకపోయేవారట. ఎస్వీఆర్ డైలాగ్ డెలివరీ అలా ఉండేది. 

అలాంటి  ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ ముగ్గురిని డామినేట్ చేసిన నటి సూర్యకాంతం అని మురళి మోహన్ అన్నారు. సాధారణంగా సావిత్రి పేరు చెబుతుంటారు. సావిత్రి కంటే సూర్యకాంతం ఇంకా ఎక్కువగా డామినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎంతో సహజంగా అనర్గళంగా ఆమె డైలాగులు చెబుతారు. అందరిని సూర్యకాంతం గారు ఆప్యాయంగా చూసేవారు. గయ్యాళి పాత్రలు వేసినప్పటికీ అందరితూ ప్రేమగా ఉండేవారు అని మురళి మోహన్ తెలిపారు. 

అలాంటి నటిని ప్రభుత్వాలు, చిత్ర పరిశ్రమ గుర్తించలేదు అనేది వాస్తవం అని మురళి మోహన్ తెలిపారు. ఆమె విగ్రహాన్ని కూడా పెట్టలేకపోయాం. అలాంటి నటికి పద్మశ్రీ ఇవ్వాలని మురళి మోహన్ అన్నారు. ఆమెలో ఎప్పుడూ రవ్వంత గర్వం కూడా కనిపించేది కాదు. 

సూర్యకాంతం గారు మరణిస్తే చూడడానికి ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదట అని యాంకర్ అడిగారు. దీనికి మురళి మోహన్ బదులిస్తూ.. అవును వెళ్ళలేదు. దురదృష్టం అలా జరగడం. ఆమెని ఎవ్వరూ గుర్తుంచుకోలేదు. సావిత్రి గారికి కూడా అలాగే జరిగింది. సావిత్రి గారు చనిపోతే పట్టుమని పదిమంది కూడా వెళ్ళలేదు. నేను దాసరి గారు, ఏఎన్నార్ గారు మాత్రమే వెళ్లాం అని మురళి మోహన్ అన్నారు. 

Latest Videos

click me!