కృష్ణ రెండో పెళ్లి చేసుకోవడం తప్పే, విజయ నిర్మలని వివాహం చేసుకోవడం వల్ల  ఏం జరిగిందంటే 

Published : Apr 11, 2025, 07:16 AM IST

సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. కృష్ణ 1961లో ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు రమేష్ బాబు, మహేష్ బాబు, ప్రియదర్శిని, మంజుల, పద్మావతి సంతానం ఉన్నారు.

PREV
14
కృష్ణ రెండో పెళ్లి చేసుకోవడం తప్పే, విజయ నిర్మలని వివాహం చేసుకోవడం వల్ల  ఏం జరిగిందంటే 
Super Star Krishna

సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. కృష్ణ 1961లో ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు రమేష్ బాబు, మహేష్ బాబు, ప్రియదర్శిని, మంజుల, పద్మావతి సంతానం ఉన్నారు. 1969లో కృష్ణ మరో వివాహం చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనం అయింది. 

24

మొదటి భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకోవడం ఏంటి అని కృష్ణపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై సీనియర్ నటుడు, నిర్మాత మురళి మోహన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణ రెండో పెళ్లి చేసుకునే సమయానికి నేను ఆర్టిస్ట్ ని కాలేదు. కృష్ణ నా స్నేహితుడే అయినప్పటికీ అతడితో మాట్లాడలేదు అని మురళి మోహన్ అన్నారు. కానీ కృష్ణ చేసింది మాత్రం తప్పే అని అనిపించింది. 

34

కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి చాలా మంచి వ్యక్తి. పిల్లలు కూడా ఉన్నారు. అలాంటప్పుడు రెండో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కాలేదు. కానీ విజయ నిర్మల, కృష్ణ ప్రేమించుకోవడం వల్ల ఆ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణ, విజయ నిర్మల పెళ్లి చేసుకోవడం ఇద్దరి కెరీర్ కి బాగా కలసి వచ్చింది అని మురళి మోహన్ తెలిపారు. 

44

విజయ నిర్మలని దర్శకత్వం చేయమని కృష్ణ ఎంకరేజ్ చేశారు. కృష్ణ ప్రోత్సాహంతోనే అనేక చిత్రాలని విజయ నిర్మల తెరకెక్కించారు. ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకుంది అంటే అందులో కృష్ణ ప్రోత్సాహం ఉంది అని మురళి మోహన్ తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories