బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌.. ఎలా మిస్‌ అయ్యిందో తెలుసా?

Published : Aug 02, 2024, 08:27 PM ISTUpdated : Aug 03, 2024, 10:00 AM IST

బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ సినిమా వస్తే చూడాలనేది అభిమానుల డ్రీమ్‌. కానీ ఇప్పటికే ఓ సారి అనుకున్నారట. మరి ఎలా మిస్‌ అయ్యిందంటే?  

PREV
16
బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌.. ఎలా మిస్‌ అయ్యిందో తెలుసా?

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చాలా బారియర్స్ బ్రేక్‌ అయ్యాయి. బడ్జెట్‌, ఇతర భాషల హీరోలు మరో భాషలో నటించడం, హీరోలు విలన్లుగా చేయడం, పాన్‌ ఇండియా ట్రెండ్‌, వెయ్యి కోట్ల కలెక్షన్లు ఇలా అన్ని లెక్కలు మారిపోయాయి. ఈ క్రమంలో మల్టీస్టారర్‌ ట్రెండ్‌ కూడా ఊపందుకుంది. సూపర్‌ హీరో మూవీస్‌ స్టయిల్‌లో ఇద్దరికి మించిన హీరోలు కనిపించే ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. `కల్కి 2898 ఏడీ` అందుకు నిదర్శనమని చెప్పొచ్చు. అదే సమయంలో మల్టీస్టారర్‌ ల ట్రెండ్‌ కూడా ఊపందుకుంది. 
 

26

`ఆర్‌ఆర్‌ఆర్‌` కి ముందు నుంచే ఈ ట్రెండ్‌ ఉన్నా. ఆ తర్వాత మాత్రం ఎక్కువగా ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగులో డ్రీమ్‌ మల్టీస్టారర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. అందులో చాలా క్రేజీ ప్రాజెక్ట్ లో ఒకటి బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించడం. ఈ ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని చాలా మందికి ఉంటుంది. అందరు హీరోల అభిమానులు దీనిపై ఆసక్తి చూపిస్తారు. కానీ వర్కౌట్‌ అయ్యే పరిస్థితి లేదు. పైగా ఈ ఇద్దరికి పడటం లేదని, ఇద్దరి మధ్య గొడవ ఉందనే రూమర్లు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. కానీ అదేంటో క్లారిటీ లేదు.
 

36

అయితే చాలా రోజుల క్రితమే బాలయ్య, నాగార్జునల మధ్య మల్టీస్టారర్ ప్లాన్‌ జరిగిందట. ఒక్కసారి కాదు రెండు సార్లు అనుకున్నారట. కానీ వర్కౌట్‌ కాలేదట. రెండు దశాబ్దాల క్రితమే.. ఓ రీమేక్ సినిమా చేయాలనుకున్నారు. మలయాళంలో హిట్‌ అయిన `క్రిస్టియన్‌ బ్రదర్స్` అనే సినిమాని బాలయ్య, నాగ్ లతో కలిసి చేయాలని అనుకున్నారట. మేకర్స్ గట్టిగానే ప్లాన్‌ చేశారు. ఆ సమయంలో ఇద్దరి డేట్లు సెట్‌ కాకపోవడంతో సినిమాని పక్కన పెట్టేశారు. తర్వాత దాన్ని లైట్‌ తీసుకున్నారు. 

46

కొన్ని రోజులకు ఈ ఇద్దరు హీరోలుగా ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలని మన దర్శక, రచయితలు భావించారు. కానీ ఇద్దరి హీరోల ఇమేజ్‌లు బ్యాలెన్స్ చేసే కథలు దొరకలేదు. చాలా ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు మేకర్స్. ఈ హీరోలు కూడా లైట్‌ తీసుకున్నారట. ఇక ఇప్పుడైతే ఇది కుదరడం చాలా కష్టం. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని, ఇప్పుడు అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా కారణాలేదైనా ఓ క్రేజీ మల్టీస్టారర్‌ని మాత్రం తెలుగు ఆడియెన్స్ మిస్‌ అయ్యారనే చెప్పాలి. 
 

56

కానీ ఓ విచిత్రం జరిగింది. ఈ ఇద్దరి కాంబోలో మల్టీస్టారర్‌ సెట్‌ కాలేదుగానీ, ఓ సినిమాలో ఈ ఇద్దరు మెరిశారు. `త్రిమూర్తులు` అనే సినిమాలో చాలా మంది స్టార్స్ గెస్ట్ రోల్‌ చేశారు. ఇందులో వెంకటేష్‌, అర్జున్‌, రాజేంద్రప్రసాద్ హీరోలుగా నటించారు. ఓ సీన్‌లో సెలబ్రిటీలు కనిపించాల్సి ఉంది. అందులో కోసం స్టార్స్ చాలా మందిని దించారు మేకర్స్. చిరంజీవి, నాగార్జున, బాలయ్య, కృష్ణ, కష్ణంరాజు, శోభన్‌బాబు, మురళీ మోహన్‌, చంద్రమోహన్‌, విజయశాంతి, రాధ, భాను ప్రియ రాధిక, శారద వంటి చాలా మంది స్టార్స్ మెరిశారు. అందులో భాగంగా బాలయ్య, నాగ్‌ కూడా ఓ సన్నివేశంలో కనిపించారు. 1987లో విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ కాలేదు. 
 

66

ఇక ఇప్పుడు బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో `ఎన్బీకే109` సినిమాలో నటిస్తున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది. దీంతోపాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సింది బాలయ్య. అలాగే నాగార్జున.. మల్టీస్టారర్స్ తో జోరుమీదున్నాడు. ఇప్పటికే ఆయన ధనుష్‌తో కలసి `కుబేర` చిత్రంలో నటిస్తున్నారు. అలాగే రజనీకాంత్‌తో `కూలీ` సినిమా చేస్తున్నారు. సోలో హీరోగా సినిమాకి సంబంధించిన వర్క్ కూడా జరుగుతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories