అయితే, కోర్టు తీర్పును విశాల్ ఉల్లంఘించారని, తమకు డిపాజిట్ రూపంలో చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకుండానే ఆయన నటించి, నిర్మించిన పలు సినిమాలని విడుదల చేశారని విశాల్‌పై లైకా సంస్థ జూన్ నెలలో కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేసింది. కానీ, అప్పుడు సంబంధిత ఆధారాలను ఆ సంస్థ కోర్టుకు చూపించలేకపోయింది. దాంతో, న్యాయస్థానం విచారణను గతంలో పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చింది.