నా కొడకా ఇంకోసారి అలా చేస్తే, రూమ్ కి పిలిచి మరీ నాగబాబు వార్నింగ్.. ముక్కు అవినాష్ కామెంట్స్ 

First Published | Jun 2, 2022, 2:57 PM IST

నాగబాబు, జబర్దస్త్ కమెడియన్ల మధ్య బంధం విడదీయరానిది. నాగబాబు ఎప్పుడూ కుటుంబ పెద్ద స్థానంలో ఉంటూ తమని గైడ్ చేస్తూ వచ్చారని సుధీర్, గెటప్ శ్రీను, ఆది లాంటి వాళ్ళు చెబుతూనే ఉన్నారు.

నాగబాబు, జబర్దస్త్ కమెడియన్ల మధ్య బంధం విడదీయరానిది. నాగబాబు ఎప్పుడూ కుటుంబ పెద్ద స్థానంలో ఉంటూ తమని గైడ్ చేస్తూ వచ్చారని సుధీర్, గెటప్ శ్రీను, ఆది లాంటి వాళ్ళు చెబుతూనే ఉన్నారు. నాగబాబు జబర్దస్త్ ని వీడి వెళ్లిన సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో నాగబాబు జబర్దస్త్ కమెడియన్లని బహిరంగ వేదికలపై ప్రోత్సహించడం చూశాం. 

Nagababu - Niharika

ఇదిలా ఉండగా జబర్దస్త్ తో, తన మిమిక్రి యాంగిల్ తో పాపులర్ అయిన ముక్కు అవినాష్ ప్రస్తుతం పలు షోలు చేస్తున్నారు. ఇటీవల వివాహం చేసుకున్న అవినాష్ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ఇంటర్వ్యూలో అవినాష్ నాగబాబు గురించి, జబర్దస్ తో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


ప్రస్తుతం అవినాష్ నాగబాబు జడ్జిగా కామెడీ స్టార్స్ ధమాకాలో చేస్తున్నాడు. నాగబాబు కోసమే ఈ జబర్దస్త్ ని వదిలి ఈ షోకి వచ్చారా అని ప్రశ్నించగా.. ముక్కు అవినాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగబాబు కోసం రాలేదు. నాగబాబు గారు చెబితేనో మేము ఈ షోకి రాలేదు. 

ఎవరి పరిస్థితులని బట్టి వారు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం నాగబాబు గారు కాదు కదా.. ఇది కూడా అంతే. కాకపోతే పరిస్థితుల వల్ల ఆయన జబర్దస్త్ ని వదిలేయడం జరిగింది. మేము కూడా అంతే అని ముక్కు అవినాష్ అన్నారు. నాగబాబు ఎప్పుడూ తమకి తండ్రి స్థానంలో ఉంటారు అని అన్నారు. ఎలాంటి పాయింట్ ఎంచుకుంటే బావుంటుందో వివరించే వారు. గైడెన్స్ ఇచ్చేవారు అని ముక్కు అవినాష్ తెలిపారు. 

ఇక ఏదైనా మిస్టేక్స్ చేస్తే.. నా కొడకా ఇంకోసారి రిపీట్ అయిందో అంటూ ఒక తండ్రిలాగా ఆయన మమ్మల్ని తిట్టేవారు. ఆయన భయంతోనే మేము స్కిట్స్ బెటర్ గా పెర్ఫామ్ చేసేవాళ్ళం. జబర్దస్త్ లో ఉన్నప్పుడు కూడా తప్పులు చేస్తే.. పక్కన రూమ్ కి పిలిచి మరీ మందలించేవారు. 

నాగబాబు గారు మాకు సలహాలు మాత్రమే ఇచ్చావారు. తప్పు చేస్తే మందలించేవారు. అంతేకాని మా నిర్ణయాల విషయంలో ఆయన బలవంతం ఉండదు. మేము జబర్దస్త్ ని విడిచిపెట్టడానికి, ప్రస్తుత మేము ఎంచుకున్న షోలకు నాగబాబు గారు కారణం కాదు ని అవినాష్ క్లారిటీ ఇచ్చారు. 

Latest Videos

click me!