`జబర్దస్త్` నుంచి సుడిగాలి సుధీర్‌ టీమ్‌ ఔట్‌.. రష్మితో క్లారిటీ ?.. రిస్క్ చేస్తున్నారా?

Published : Jun 02, 2022, 02:47 PM IST

`జబర్దస్త్` కామెడీ షో నుంచి పాపులర్‌ కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌ టీమ్‌ బయటకు వచ్చేసిందా? ఆ విషయం యాంకర్‌ రష్మితో క్లారిటీ ఇచ్చేశారా? సుధీర్‌ వేరే షో చేయడమే కారణమా? ఇప్పుడిదే హాట్‌ టాపిక్.   

PREV
18
`జబర్దస్త్` నుంచి సుడిగాలి సుధీర్‌ టీమ్‌ ఔట్‌.. రష్మితో క్లారిటీ ?.. రిస్క్ చేస్తున్నారా?

జబర్దస్త్(Jabardasth) షో ప్రారంభం నుంచి ఉన్నాడు సుడిగాలి సుధీర్‌(Sudigaali Sudheer). ఆయన టీమ్‌ మెంబర్స్ రాంమ్‌ ప్రసాద్‌, గెటప్‌ శ్రీను. మొదట వేరుగా ఉన్నా, క్రమంగా టీమ్‌గా కలిశారు. ఇప్పటి వరకు ఆ టీమ్‌ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ ముగ్గురు కలిసి కనిపించడం లేదు. గెటప్‌ శ్రీను చాలా కాలంగానే కనిపించడం లేదు. ఆయన సినిమాల్లో బిజీ అయ్యాడు. 

28

మరోవైపు ఇటీవల కాలంలో సుడిగాలి సుధీర్‌ కూడా కనిపించడం లేదు. రామ్‌ ప్రసాద్‌ ఒక్కడే ఉన్నారు. ఆయనతోపాటు హైపర్‌ ఆది ఉండేవారు. కానీ ఆదిని కూడా తొలగించినట్టు వార్తలొస్తున్నాయి. సుధీర్‌, ఆదిలను కూడా నిర్వహకులు తొలగించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరిని `ఢీ` షో నుంచి తొలగించారు. అదే సమయంలో వీరికి ఇతర షోస్‌లు, సినిమా అవకాశాలు రావడంతో బిజీగా ఉండటంతో `జబర్దస్త్` కి టైమ్‌ ఇవ్వలేకపోతున్నారనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. 
 

38

అయితే సుడిగాలి సుధీర్‌ హోస్ట్ గా చేస్తున్న `శ్రీదేవి డ్రామా కంపెనీ` (Sridevi Drama Company) లేటెస్ట్ ప్రోమోలో కూడా సుధీర్‌ కనిపించలేదు. ఆయన స్థానంలో యాంకర్‌ రష్మి (Rashmi) వచ్చింది. దీంతో ఈటీవీని సుధీర్‌ టీమ్‌ వీడిపోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. `శ్రీదేవి డ్రామా కంపెనీ` లేటెస్ట్ ప్రోమోలో కూడా హైపర్‌ ఆది.. రష్మిపై పంచ్‌ వేశారు. `మీరు ముందుగానే ప్లాన్‌ చేసుకున్నట్టున్నారు, కొన్ని రోజులు నువ్వు చేయు, తర్వాత నేను చేస్తాన`ని అని రష్మిని ఉద్దేశించి డైలాగ్‌ పేల్చాడు హైపర్‌ ఆది. దీంతో ఈ వార్తల్లో నిజముందనేదానికి బలం మరింత పెరిగింది.

48

ఇదిలా ఉంటే సుడిగాలి సుధీర్‌ ఇటీవల మరో టీవీలో షో చేస్తున్నారు. స్టార్‌ మాలో `సూపర్‌ సింగర్స్ జూనియర్స్` షోని అనసూయతో కలిసి చేస్తున్నారు. `జబర్దస్త్` నుంచి వీడటానికి ఇది కూడా ఓ కారణమని తెలుస్తుంది. `ఢీ` నుంచి తొలగించడం వల్ల, సుధీర్‌ క్రేజ్‌ని మా వాళ్లు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పైగా మరో జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయతో కలిసి షో చేయడంతో ఆ క్రేజ్‌ మొత్తం స్టార్‌ మా కొట్టాలని భావిస్తున్నట్టు టాక్‌. 
 

58

మరోవైపు సుడిగాలి సుధీర్‌ ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా రెండుమూడు సినిమాలు చేస్తున్నారు. `గాలోడు` చిత్రీకరణ జరుపుకుంటోంది. `వాంటెడ్‌ పండుగాడ్‌` అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. అలాగే `కాలింగ్‌ సహస్త్ర` అనే మరో సినిమాలోనూ హీరోగా చేస్తున్నాడు. ఇలా హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు సుధీర్‌. షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో `జబర్దస్త్`కి రాలేకపోతున్నాడని అంటున్నారు. కొంత గ్యాప్‌తో మళ్లీ షోలో జాయిన్‌ అవుతాడని టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

68

`జబర్దస్త్` షోలో సుడిగాలి సుధీర్‌, రష్మిల కెమిస్ట్రీ హైలైట్‌గా నిలుస్తుంది. గత ఎనిమిదేళ్లుగా షోకి హైప్‌ తీసుకొస్తూ, దానికి ఆదరణ పెంచుతుంది వీరి మధ్య ఉన్న రిలేషన్‌. అయితే ఈ జోడి షోని డామినేట్‌ చేసే స్థాయికి వచ్చారని `మల్లెమాల` నిర్వహకులు భావిస్తున్నారని, వీరు లేకపోతే షో రేటింగ్‌ దారుణంగా పడిపోతుందనే భావనతో నెమ్మదిగా ఒక్కొక్కరి పంపించేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతిమంగా షో ఉండాలి కానీ, అది వ్యక్తుల వల్ల ప్రభావితం కాకూడదనే ఆలోచనతో నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. 

78

ఇదే నిజమైతే, సుడిగాలి సుధీర్‌ టీమ్‌ లేకపోతే, వాళ్లు ఏ రూపంలో వెళ్లిపోయినా, అది షోపై గట్టిగా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు వారి అభిమానులు. సుధీర్‌పై ఆది పంచ్‌లు ఎవర్‌ గ్రీన్‌ అని, అదే సమయంలో సుధీర్‌- రష్మిల కెమిస్ట్రీ ఎవర్‌ గ్రీన్‌ అంటున్నారు. వీరు లేకుండా జబర్దస్త్ ని ఊహించుకోలేమంటున్నారు. జబర్దస్త్ కి వాళ్లే మెయిన్‌ పిల్లర్‌ అని అంటున్నారు. 

88

ఇదిలా ఉంటే షో నుంచి మెయిన్‌ పిల్లర్స్ వెళ్లిపోతున్నారు. ఇప్పటికే నాగబాబు వెళ్లిపోయాడు. ఇటీవల రోజా వదిలేసింది. మరోవైపు కంటిన్యూగా జడ్జ్ లు ఉండటం లేదు. మనో ఇతర షోలతో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన కేవలం ఒకే షోకి టైమ్‌ ఇస్తున్నారు. దీంతో ఇంద్రజ, పూర్ణ, ఆమని, సదా వంటి వారిని గెస్ట్ జడ్జ్ లుగా పిలుస్తూ ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికీ ఎవరూ సెట్‌ కాలేదు. ఇది కూడా ఈ షోపై ప్రభావాన్ని చూపుతుందనే టాక్‌ వినిపిస్తుంది. దీనికితోడు ఇప్పుడు సుధీర్‌ బ్యాచ్‌ వెళ్లిపోతుందనే వార్త హాట్‌ టాపిక్‌ అవుతుంది. మరి ఇది ఎంత వరకు నిజం, దీన్ని నిర్వహకులు ఎలా డీల్‌ చేస్తారానేది చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories