ఇంట్లో విషాదం జరిగినా వృత్తి కోసం కామెడీ షోలో ముక్కు అవినాష్..కాబోయే భర్త పవన్ కళ్యాణ్ అంటూ..

First Published | Jan 13, 2024, 10:05 AM IST

గుండెల్లో విషాదం ఉన్నప్పటికీ అవినాష్ వెంటనే తేరుకుని సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న ఒక షోలో నవ్వులు పూయించేందుకు షూటింగ్ లో పాల్గొన్నాడు. శ్రీముఖి యాంకర్  స్టార్ మా పరివారం సంక్రాంతి స్పెషల్ షోలో ముక్కు అవినాష్ పాల్గొన్నాడు.

ముక్కు అవినాష్ కి జబర్దస్త్ షో గుర్తింపు తీసుకువచ్చింది. అయితే బిగ్ బాస్ 4 లో పాల్గొన్న తర్వాత అవినాష్ కెరీర్ లో మరింత బిజీ అయ్యాడు. నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నాడు.జబర్దస్త్ ఆఫర్స్ రాకముందు, కోవిడ్ సమయంలో అవినాష్ తీవ్ర మానసిక వేదన అనుభవించాడట. అయితే శ్రీముఖి, చమ్మక్ చంద్ర లాంటి వాళ్ళు సహాయం చేయడంతో బిగ్ బాస్ కి వెళ్లి మరింత పాపులర్ అయ్యాడు. 

ఆ మధ్యన ముక్కు అవినాష్ వివాహం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. అవినాష్ భార్య పేరు అనూజ. 2021లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే గత ఏడాది అవినాష్, అనూజ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు సంతోషంగా ప్రకటించారు.సీమంతం, మెటర్నిటీ ఫోటో షూట్స్ కూడా చాలా గ్రాండ్ గా జరిగాయి. ముక్కు అవినాష్ , అనూజ దంపతులకు వారి కుటుంబ సభ్యులకు తీవ్ర వేదన మిగిలింది. 


దాదాపు 7 నెలలు నిండిన తర్వాత శిశువు తల్లి గర్భంలోనే మరణించింది. ఈ చేదు వార్తని ముక్కు అవినాష్ స్వయంగా తన సోషల్ మీడియాలో తెలిపాడు. ఎంతో భావోద్వేగానికి గురవుతూ పోస్ట్ చేశాడు. ముక్కు అవినాష్ కుటుంబం మొత్తం తీవ్ర వేదన అనుభవిస్తున్నారు. తన కుటుంబంలో ఇంత పెద్ద విషాదం జరిగినప్పటికీ ముక్కు అవినాష్ తన వృత్తి ధర్మాన్ని మాత్రం వదలడం లేదు. 

గుండెల్లో విషాదం ఉన్నప్పటికీ అవినాష్ వెంటనే తేరుకుని సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న ఒక షోలో నవ్వులు పూయించేందుకు షూటింగ్ లో పాల్గొన్నాడు. శ్రీముఖి యాంకర్  స్టార్ మా పరివారం సంక్రాంతి స్పెషల్ షోలో ముక్కు అవినాష్ పాల్గొన్నాడు. తాజాగా ఈ షో ప్రోమో విడుదలైంది. ముక్కు అవినాష్ తన లోపల ఎంత బాధ ఉన్నప్పటికీ కామెడీ టైమింగ్ లో మాత్రం లోపం రానివ్వడం లేదు. 

ముక్కు అవినాష్ శ్రీముఖి ధరించిన శారీ పై ఫన్నీ కామెంట్స్ చేశాడు. నువ్వు కట్టుకున్న బెడ్ షీట్ చాలా బావుంది అని అంటాడు. దీనితో శ్రీముఖి బదులిస్తూ ఆ కుర్చీ మడతపెట్టి అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇక బిగ్ బాస్ 7 లో ఫైనలిస్ట్ గా నిలిచిన అర్జున్ అంబటి కూడా స్టార్ మా పరివారంలో హంగామా చేశాడు. 

రీసెంట్ గా నిచ్చితార్ధం చేసుకున్న మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ వాసంతి కూడా మెరిసింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వాసంతికి శుభాకాంక్షలు తెలిపింది. శ్రీముఖి వాసంతిని ఆమెకి కాబోయే భర్త పేరు అడగగా.. వాసంతి పవన్ కళ్యాణ్ అని సమాధానం ఇచ్చింది. దీనితో అక్కడున్న వారంతా కేరింతలు, ఈలలతో హంగామా చేశారు. వాసంతి ప్రియుడి పేరు పవన్ కళ్యాణ్. చాలా కాలంగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారు. 

ముక్కు అవినాష్, శ్రీముఖి, అర్జున్ కలసి చేసిన కామెడీ ఈ ప్రోమోలో హైలైట్ గా నిలిచింది. వీరితో పాటు డాక్టర్ బాబు నిరుపమ్ కూడా హంగామా చేశాడు. ఆదివారం రోజు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. 

Latest Videos

click me!