మృణాల్‌తో పెట్టుకుంటే బొక్కలు ఇరిగిపోవాల్సిందే.. కిక్‌ బాక్సింగ్‌ నేర్చుకుంటున్న `సీతారామం` బ్యూటీ

`సీతారామం`లో సీతగా కనువిందు చేసింది మృణాల్. ప్రేమికురాలిగా ఆకట్టుకుంది. ఎంతో సుకుమారంగా ఉండే ఈ అమ్మడిలో మరో కోణం ఉంది. ఎవరైనా టచ్‌ చేస్తే మాత్రం వారి బొక్కలు చూరచూర అవ్వాల్సిందే అట..
 

mrunal thakur showing another angle in her she trains mma interesting details arj

మృణాల్‌ ఠాకూర్‌ లేట్ గా గుర్తించబడ్డ అందం. సినీ రంగంలోకి అడుగుపెట్టి పదేళ్లు అయినా `సీతారామం` ఆమెకి బ్రేక్‌ ఇచ్చింది. అనేక స్ట్రగుల్స్ అనంతరం ఆమెకి లైఫ్‌ వచ్చింది.ఇప్పుడు హిందీతోపాటు సౌత్‌లోనూ మోస్ట్ వాంటెడ్‌ హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు. నార్త్ టూ సౌత్‌ వరుసగా ఆఫర్లని అందుకుంటూ దూసుకుపోతుంది. స్టార్‌ హీరోలకు మృణాల్‌ బెస్ట్ ఆప్షన్‌ అవుతుంది. 

తాజాగా మృణాల్‌ ఠాకూర్‌ ఫైట్స్ చేస్తుంది. ప్రత్యర్థులను మట్టికరిపించేందుకు సన్నద్ధమవుతుంది. ఆమె కఠినమైన మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ చేస్తుంది. తనతో పెట్టుకుంటే బొక్కలు చూర చూర చేసేందుకు రెడీ అవుతుంది. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్‌ అవుతుంది. నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి సుకుమారమైన చేతులు, మంత్రముగ్దుల్ని చేసే అందాలతో ఆకట్టుకుంటూ కుర్రాళ్లని పిచ్చెక్కించే ఈ భామ మార్షల్‌ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకుంటుంది. ఆ అవసరం ఏమొచ్చిందనేది చూస్తే..


`సీతారామం` చిత్రంతో తెలుగులోనే కాదు పాన్‌ ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయ్యింది మృణాల్‌ ఠాకూర్‌. అంతకు ముందు హిందీలో సినిమాలు చేస్తూ వచ్చిన ఈ బ్యూటీకి `సీతారామం` పెద్ద బ్రేక్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. దీంతో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో నానితో `హాయ్‌ నాన్న` చిత్రంలో నటిస్తుంది. అలాగే విజయ్‌ దేవరకొండతో పరశురామ్‌ సినిమా చేస్తుంది. మరోవైపు హిందీలో రెండు మూడు సినిమాలున్నాయి. 
 

ఇదిలా ఉంటే మృణాల్‌.. ఫర్హాన్‌ అక్తర్‌తో కలిసి `టూఫాన్‌` చిత్రంలో నటించింది. బాక్సింగ్‌నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఇందులో ఫర్హాన్‌ బాక్సర్‌గా కనిపిస్తాడు.అందులో మృణాల్‌ కొన్నియాక్షన్‌ సీన్లు కూడా చేసింది. ఆ టైమ్‌లో కొంత ప్రాక్టీస్‌ కూడా చేసింది. ఆ టైమ్‌లో మృణాల్‌కి కిక్‌ బాక్సింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. దీంతో దాన్ని కంటిన్యూ చేస్తుంది. కిక్‌ బాక్సింగ్‌లో పంచ్‌లు నేర్చుకుంటుందట. ప్రొఫేషనల్‌ కిక్‌ బాక్సింగ్‌, మిక్స్ డ్ మార్షల్‌ ఆర్ట్స్ ట్రైనర్‌ రోహిత్‌ నాయర్‌ వద్ద మృణాల్‌ ఇందులో శిక్షణ తీసుకుంటుంది. ఇది తనకి ఉపయోగపడుతుందని ఆమె భావిస్తుందట. 
 

తాజాగా దీనిపై మృణాల్‌ స్పందిస్తూ, మిక్స్ డ్ మార్షల్‌ ట్రైనింగ్‌ `సెల్ఫీ` చిత్రంలో తనకు ఎంతో ఉపయోగపడిందని చెప్పింది మృణాల్‌. రోహిత్‌ నాయర్‌ వద్ద శిక్షణ తీసుకోవాలంటే చాలా కృషి, అంకిత భావం కావాలి. దీనిపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. అప్పుడే సాధ్యమవుతుంది. ఇది నాకు సవాల్‌తో కూడినది అని పేర్కొంది మృణాల్‌.  అక్షయ్‌ కుమార్‌ నటించిన `సెల్ఫీ` మూవీలో మృణాల్‌ ఐటెమ్‌ నెంబర్ చేసింది. ఇందులో యాక్షన్‌ కూడా చేసిందీ బ్యూటీ. అయితే ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయడానికి కారణం కొత్త సినిమాకోసమని తెలుస్తుంది. ఆ వివరాలు తెలియాల్సి ఉంది.
 

ఇదిలా ఉంటే కిక్‌ బాక్సింగ్, మార్షల్‌ ఆర్ట్స్ వంటివి నేర్చుకున్న మృణాల్ తో ఎవరైనా పెట్టుకుంటే బొక్కలు చూరచూర అవ్వాల్సిందే అంటున్నారు నెటిజన్లు. ఈ విషయం నెట్టింట వైరల్‌ అవుతుంది. మరోవైపు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోతతో దుమ్మురేపుతుంది మృణాల్‌. ఇది `సీతారామం` చేసిన సీతేనా అని షాక్‌ అయ్యేలా ఆమె గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూ ఆశ్చర్యపరుస్తుంది. నెటిజన్లకి విజువల్ ట్రీట్‌ ఇస్తుంది.

Latest Videos

vuukle one pixel image
click me!