వోణీ తీసేసి.. లెహంగాలో రకుల్ ప్రీత్ మెరుపులు.. మత్తు ఫోజులతో తీపి బాణాలు విసురుతున్న ఢిల్లీ భామ

First Published | Jul 21, 2023, 3:05 PM IST

బాలీవుడ్ లో మొన్నటి వరకు ఊపూపింది ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్. మళ్లీ దక్షిణాది చిత్రాల్లో నటిస్తోంది. క్రేజీ ప్రాజెక్ట్ ల్లో హీరోయిన్ గా అలరించబోతోంది. మరోవైపు ఆయా ఈవెంట్లకూ హాజరవుతూ సందడి చేస్తోంది. 
 

టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)  వరుస చిత్రాలతో దుమ్ములేపిన విషయం తెలిసిందే. బడా హీరోల సరసన నటించి మెప్పించింది. తన అందం, నటనతో ప్రేక్షకులనూ మెప్పించింది. మరోవైపు ఇండస్ట్రీలోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 
 

నాలుగైదు ఏళ్లుగా రకుల్  ప్రీత్ తెలుగు ఇండస్ట్రీకి మాత్రం దూరంగా ఉంది. చివరిగా ‘కొండపొలం’లో నటించింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత నేరుగా బాలీవుడ్ లో అడుగుపెట్టి వరుస చిత్రాలతో అదరగొట్టింది. ఏకంగా గతేడాది ఐదు  సినిమాలతో అలరించింది. 


అయితే బాలీవుడ్ లోని చిత్రాలు ఆశించిన మేర ఫలితానివ్వకపోవడంతో మళ్లీ సౌత్ సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తోంది. ప్రస్తుతం తమిళంలో ‘ఇండియన్ 2’, ‘ఆయలాన్’లో నటిస్తోంది. ఇక తెలుగులోకి రీఎంట్రీ ఎప్పుడు ఇస్తుందో చూడాలి. 

ఇదిలా ఉంటే.. రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తున్నారు. సినిమా అప్డేట్స్ ఉన్నా.. లేకున్నా.. ఏదోక పోస్టు పెడుతూ తన అభిమానులను ఖుషీ చేస్తూనే వస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని బ్యూటీఫుల్ ఫొటోలను షేర్ చేసింది. 
 

లేటెస్ట్ గా పంచుకున్న ఫొటోస్ లో రకుల్ చాలా అందంగా మెరిసింది. లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. మరోవైపు బ్యూటీఫుల్ లుక్ తో పాటు మత్తెక్కించే ఫోజులతో ఆకట్టుకుంది. మత్తు చూపులతో మైమరిపించింది. రకుల్ నయా లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 
 

అయితే, నిన్న ముంబైలో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్ కోసం రకుల్ ట్రెడిషనల్ వేర్ ధరించింది. ప్రముఖ సెలబ్రెటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిన్న ముంబైలో గ్రాండ్ బ్రైడల్ కోచర్ షోను నిర్వహించారు. తన ఫ్యాషన్ బ్రాండ్ ప్రారంభించి 18 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈవెంట్ నిర్వహించారు. రకుల్ తోపాటు బాలీవుడ్ తారలు హాజరై సందడి చేశారు. 

Latest Videos

click me!