Mrunal Thakur: నిమిషానికి పది లక్షలు.. మృణాల్ ఠాకూర్ డిమాండ్ కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..?

Published : Dec 17, 2023, 02:45 PM IST

స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతుంది మృణాల్ ఠాకూర్.. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. అంతే కాదు ఆమె డిమాండ్ మామూలుగా లేదు. నిమిషానికి లక్షల్లో డిమాండ్ చేస్తుదంట బ్యూటీ.   

PREV
16
Mrunal Thakur: నిమిషానికి పది లక్షలు.. మృణాల్ ఠాకూర్ డిమాండ్ కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..?

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది మృణాల్. టాలీవుడ్ లో ఇద్దరు హీరోయిన్ల హవా నడుస్తుంది. ఒక వైపు మృణాల్.. మరోవైపు శ్రీలీల ఇద్దరు ఇండస్ట్రీని ఏలుతున్నారు. వీరిద్దరి డిమాండ్ కూడా భారీగా ఉందట. రెండుమూడు సార్లు రెమ్యూనరేషన్ కూడా పెంచారట. తాజాగా మృణాల్ ఠాకూర్ రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గామారింది. 
 

26

 టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటున్నారు మృణాల్.  సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారని చెప్పాలి ఈమె రెమ్యూనరేషన్ పరంగా వచ్చిన అవకాశాలన్నింటిని ఏమాత్రం సద్వినియోగం చేసుకోకుండా సినిమా కథలో కంటెంట్ ఉందా లేదా అన్న విషయాలను గమనిస్తున్నారు.

36

తాజాగా హాయ్ నాన్న సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ. అయితే డిమాండ్ ఉన్న హీరోయిన్లను వ్యాపార సంస్థల ఓపెనింగ్స్ కు పిలవడం.. కామన్. ఓపెనింగ్ కు వారు భారీగా డిమాండ్ చేస్తుంటారు. ఇప్పుడు మృణాల్ హవా సాగుతోంది. దాంతో ఆమె డిమాండ్ కూడా భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె డిమాండ్ తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవుతుందట యజమానులకు. 

46

ఈ క్రమంలోనే నటి మృణాల్ ఠాకూర్ మాత్రం ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే ఈమె దూరంగా ఉండడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఈమె డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ భారీగా ఉండడంతోనే షాప్ ఓనర్స్ తనని ఇన్వైట్ చేయడం లేదని తెలుస్తోంది. 

56

షాపింగ్ మాల్స్  ప్రారంభోత్సవానికి రావాలి అంటే ఆ షాపింగ్ మాల్ లో ఎన్ని నిమిషాలు ఉంటే.. అన్ని నిమిషాలకు.. నిమిషానికి 10లక్షల చొప్పున డిమాండ్ చేస్తుందట. అంటే... గంటకు పైన  ఉంటే.. ఆరుకోట్లు ఆమెకు సమర్పించుకోవాల్సిందే. దాంతో యజమానులు బెంబేలెత్తిపోతున్నారనిసమాచారం. 

66

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైతే గంటకు ఆరు కోట్ల పైన డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇలా నిమిషానికి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట. షాపింగ్ మాల్ లో ఎన్ని గంటలు ఉంటే అంత మొత్తంలో డబ్బు ఇవ్వాలని అడగడంతో షాపింగ్ మాల్ నిర్వాహకులు ఎవరు కూడా ఈమెను పిలవడంలేదు. ఇక సినిమాల పరంగా దూసుకుపోతోంది బ్యూటీ.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ జంటగా ఫ్యామిలీ స్టార్ లో నటిస్తోంది. 
 

click me!

Recommended Stories