ఇక అంతకు ముందు బిగ్‌బాస్... అంటే సీజన్ 5 విజేత సన్ని. మైండ్ గేమ్ ఆడుతూ.. ఎవరికీ అంత ఈజీగా దొరకకుండా జాగ్రత్తగా నెట్టుకొచ్చాడు సన్నీ. చిన్న స్థాయి నుంచి.. బిగ్ బాస్ విన్నర్ వరకూ ఎదిగిన సన్నీ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు సన్నీ. బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలేలో ఓటింగ్ పరంగా దాదాపు 50 శాతం ఆయనకు పడినట్లు తెలుస్తోంది. సన్నీకి బిగ్ బాస్ 5 తెలుగు టైటిల్ ట్రోపీతో పాటు 50 లక్షల క్యాష్ ప్రైజ్, షాద్ నగర్‌లో సువర్ణభూమి నుంచి 25 లక్షలు విలువ చేసే ఫ్లాట్, ఓ టీవీయస్ బైక్ గెలిచారు.అయితే కెరీర్ పరంగా మాత్రం సన్నీ హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. ఏదో ఒక రోజు స్టార్ గా మారాలని పట్టుదలతో ఉన్నాడు.