టాప్ అందాలతో చూపు తిప్పుకోకుండా చేసిన నాని హీరోయిన్.. మృణాల్ గ్లామర్ మెరుపులకు మతిపోవాల్సిందే..

First Published | Mar 24, 2023, 10:52 AM IST

సౌత్ ఆడియెన్స్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో అందాల ధాటికి పాల్పడుతోంది. లేటెస్ట్ పిక్స్ బ్యూటీఫుల్ గా ఉన్నాయి.
 

‘సీతారామం’ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). దుల్కర్ సల్మాన్ సరసన సీతామహాలక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఫలితంగా టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు అందుకుంటోంది.
 

మృణాల్ ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీగా హీరోయిన్ గా మారింది.  అందం, అద్బుతమైన నటనతో తనను తాను ఫ్రూవ్ చేసుకుంది. దీంతో భారీ చిత్రాల్లో ఆఫర్లను అందుకుంటూ వస్తోంది. రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని 30వ చిత్రంలోనూ హీరోయిన్ గా అవకాశం అందుకున్న విషయం తెలిసిందే. 
 


ఇదిలా ఉంటే బాలీవుడ్ లోనూ వరుస ప్రాజెక్ట్స్ ను దక్కించుకుంటోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన సినిమా విషయాలను ఫ్యాన్స్ కు అందిస్తోంది. అలాగే గ్లామర్ మెరుపులూ మెరిపిస్తోంది. 

స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట మంటలు రేపుతున్న మృణాల్ ఠాకూర్ తాజాగా మరిన్ని బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. తాజా ఫొటోలకు ఫ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు. మెరిసిపోతున్న యంగ్ బ్యూటీ రూపసౌందర్యానికి మంత్రముగ్ధులవుతున్నారు. 
 

తాజాగా మృణాల్ పంచుకున్న ఫొటోల్లో టాప్ అందాలను వడ్డించింది. ఎద సొగసుతో, అందమైన మెడ, వెలిగిపోపుతున్న రూపసౌందర్యంతో కట్టిపడేసింది. మత్తు పోజులతో కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేసింది. అందంతోనే నెటిజన్ల ఊపిరిని ఆవిరి చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలను ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. 
 

మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం దక్షిణాది చిత్రాలపైనే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ బ్యూటీకి టాలీవుడ్ నుంచి ఆఫర్లు అందుతున్నాయి. దీంతో హైదరాబాద్ లోనే ఇల్లు కూడా కొన్నదంటున్నారు. Nani30 సినిమాతో పాటు.. రామ్ చరణ్ సరసన RC16లోనూ హీరోయిన్ గా అవకాశం దక్కించుకుందని అంటున్నారు. 
 

Latest Videos

click me!