ఏమున్నారు ఇద్దరూ, కిల్లర్ లుక్స్ తో చంపేస్తున్న విరుష్క జోడి.. అనుష్క కన్నా కోహ్లీనే అంటూ కొంటె కామెంట్స్

Published : Mar 24, 2023, 10:28 AM IST

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ 2017లో వివాహం చేసుకున్నారు. ఒకరినొకరు ప్రేమించుకున్న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

PREV
16
ఏమున్నారు ఇద్దరూ, కిల్లర్ లుక్స్ తో చంపేస్తున్న విరుష్క జోడి.. అనుష్క కన్నా కోహ్లీనే అంటూ కొంటె కామెంట్స్

అందాల భామ అనుష్క శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇద్దరూ అగ్రెసివ్ గానే ఉంటారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసే సమయంలో అనుష్క శర్మ రియాక్షన్స్ చూస్తూనే ఉన్నాం. భార్యాభర్తలుగా విరాట్, అనుష్క అన్యోన్యంగా జీవిస్తూనే వారి వారి వృత్తుల్లో రాణిస్తున్నారు. 

26

మొన్నటివరకు విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో టెస్టు, వన్డే సిరీస్ లతో బిజీగా గడిపాడు. చెన్నైలో జరిగిన చివరి వన్డేతో ఆస్ట్రేలియా సిరీస్ ముగిసింది. దీనితో కోహ్లీకి కాస్త విశ్రాంతి లభించింది. కాస్త టైం దొరకగానే మనోడు తన అందాల భార్యతో ఫోటోషూట్స్ మొదలు పెట్టాడు. 

36

ఈ ఫొటోస్ ని అనుష్క శర్మ ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది. బ్లూ టైట్ ఫిట్ స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో అనుష్క శర్మ.. బ్లాక్ సూట్ లో విరాట్ కోహ్లీ యమా స్టైలిష్ గా ఉన్నారు. ఒకరిని మించేలా ఒకరు అన్నట్లుగా ఇద్దరి ఫోజులు ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ లాగా మారాయి. 

46

అనుష్క, కోహ్లీ కిల్లర్ లుక్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎవరికి తోచినట్లుగా వారు ఈ ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు. రెండు విజయాలు పోటీ పడుతున్నట్లు అనిపిస్తోంది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. 

56

అనుష్క శర్మ కంటే విరాట్ కోహ్లీనే యంగ్ గా కనిపిస్తున్నాడు అంటూ మరో నెటిజన్ సరదా కామెంట్స్ చేశారు. అనుష్క శర్మ మోడ్రన్ డ్రెస్ లో కూడా పాదాలకు పట్టీలు ధరించి కనిపించింది. హై హీల్స్, మోడ్రన్ డ్రెస్ లో పట్టీలు వేసుకునే హీరోయిన్లు చాలా తక్కుమంది అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. 

66

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ 2017లో వివాహం చేసుకున్నారు. ఒకరినొకరు ప్రేమించుకున్న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.అనుష్క శర్మ 'రబ్ నే బనాది జోడి' చిత్రంతో హీరోయిన్ గా మారింది. తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం అనుష్క పలు చిత్రాల్లో నటిస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories