సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలాగా ఆమె చీర, లంగాఓణీలో మైమరపించింది.
29
త్వరలో మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో భారీ ఆఫర్స్ అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్టార్ హీరోల చిత్రాలకు ఆమె ఛాయిస్ గా మారుతోంది. అంతలా సీతా రామం చిత్రంలో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది ఈ యంగ్ బ్యూటీ.
39
చూపు తిప్పుకోలేని అందం ఒకెత్తయితే.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా ఆమె పెర్ఫామెన్స్ మరో ఎత్తు. అవసరమైనప్పుడు చిలిపిగా, హుందాగా నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
49
రామ్ ప్రేయసి సీతామహాలక్ష్మీగా క్యూట్ గా చిలిపిగా నటిస్తూ.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా హుందాగా నటించి భలే ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లో సైతం అదరగొట్టేసింది. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది అంటూ నెటిజన్లు అంటున్నారు.
59
మరొక్క హిట్ కొడితే మృణాల్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా మారిపోవడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు. నటన పూర్తిగా రాకున్నా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్న చాలా మంది హీరోయిన్లకు మృణాల్ ఠాకూర్ బిగ్ థ్రెట్ అని అంటున్నారు.
69
తాజాగా మృణాల్ ఠాకూర్ షేర్ చేసిన పిక్స్ నెట్టింట దూసుకుపోతున్నాయి. చాలా రోజుల తర్వాత మృణాల్ ఠాకూర్ ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించడం తో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు.
79
పెళ్ళికూతురిలా నిండైన చీరలో, ఒంటినిండా ఆభరణాలతో మృణాల్ మురిపిస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. సీతా రామం చిత్రంతో మృణాల్ ఠాకూర్ కి హోమ్లీ ఇమేజ్ దక్కింది. ఆ తర్వాత ఆమె కొన్ని హాట్ ఫోజుల్లో కనిపించడంతో నెటిజన్ల నుంచి ట్రోలింగ్ ఎదుర్కొంది. ఆమె అభిమానులు కూడా ఫీల్ అయ్యారు.
89
అయితే తాజాగా మృణాల్ ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో అలా కనిపించడంతో పండగా చేసుకుంటున్నారు. కొందరు నెటిజన్లు మృణాల్ పిక్స్ చూస్తూ మేము తీన్మార్ డ్యాన్స్ చేస్తున్నాం.. సీత మళ్ళీ వచ్చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
99
మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ పిక్స్ కి లవ్ ఎమోజిలతో తమ స్పందన తెలియజేస్తున్నారు. మృణాల్ ట్రెడిషనల్ లుక్ లో చిరునవ్వులు చిందిస్తూ విజువల్ ఫీస్ట్ ఇస్తోంది.