పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సల్మాన్ ఖాన్.. ‘తండ్రి కావాలనుకుంటున్నా’ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

First Published | Apr 30, 2023, 6:08 PM IST

బాలీవుడ్ స్టార్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) తన పెళ్లి గురించి స్పందించారు. తండ్రి కావాలనే ఆలోచనలో ఉన్నానంటూ బాయ్ జాన్  ఆసక్తికర కామెంట్స్ చేశారు. 
 

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేరీర్ లో తారాస్థాయికి చేరుకున్న బాయ్ జాన్ ఇప్పటికీ భారీ ప్రాజెక్ట్స్ తో అభిమానులు, ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. మరోవైపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానూ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. 
 

బాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లతో సల్మాన్ ఖాన్ ప్రేమలో పడ్డారు. కానీ పెళ్లి వరకు వెళ్లలేదు. గతంలో మాత్రం సీనియర్ నటితో జూహీ చావ్లాతో పెళ్లి వరకు వెళ్లి ఆగిపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని కూడా బాయ్ ఆయా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఆ తర్వాత నుంచి బాయ్ జాన్ పెళ్లి ఎప్పుడనేది ఆసక్తికరంగా మారింది.
 


తాజాగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ తన పెళ్లి గురించి, పిల్లల గురించి స్పందించారు. ప్రస్తుతం ఆయన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇన్నాళ్లు పెళ్లి గురించి మాట్లాడని బాలీవుడ్ స్టార్ తాజాగా స్పందించడం ఆసక్తికరంగా మారింది. సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. 

‘మా ఇంటికి కోడల్ని తీసుకురావాలనే ఆలోచన ఇప్పుడైతే నాకు ఏమాత్రం లేదు. కానీ నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తాను. ఓ పాపను తీసుకొచ్చి పెంచుకోవాలని ఉంది. ఇది సాధ్యపడేలా భారతీయ చట్టాలు ఉన్నాయో, లేవో చూడాలి. లేదంటే ఏం జరుగుతోందో చూడాలి’ అంటూ స్పందించారు. 

సల్మాన్ ఖాన్ తన చెల్లెల్లు, బ్రదర్స్ వాళ్ల పిల్లలతో చాలా ఫ్రెండ్లీ ఉంటారు. వారిపై ప్రేమ కురిపిస్తూనే ఉంటాడు. ఏదేమైనా సల్మాన్ ఖాన్ ఇన్నాళ్లకు తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇది ఎప్పటికి నెరవేరుతుందోనన్నది చూడాలి. దీనిపై సల్మాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలంటున్నారు. 
 

తెలుగులో ‘ఆచార్య’, హిందీలో ‘ఫఠాన్’ చిత్రాల్లో గెస్ట్ అపియరెన్స్ తో ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా ‘కిసి కా బాయ్ కిసి కి జాన్’తో  ప్రేక్షకులను అలరించాడు. నెక్ట్స్ భారీ ప్రాజెక్ట్ Tiger3  రానుంది. 2023 నవంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.  ఆ తర్వాత ‘పఠాన్ వర్సెస్ టైగర్’ ప్రాజెక్ట్స్ లో నటించబోతున్నట్టు తెలుస్తోంది.

Latest Videos

click me!