ఆ విషయంలో తమన్నాని మించిపోయిన మృణాల్‌ ఠాకూర్.. `లస్ట్ స్టోరీస్‌2` బెడ్‌ సీన్‌ ట్రెండింగ్‌.. నెటిజన్ల గోల

Published : Jun 29, 2023, 08:30 PM ISTUpdated : Jun 30, 2023, 12:40 PM IST

తమన్నా ఇటీవల ఓ ఓటీటీ షో కోసం బోల్డ్ సీన్‌లో నటించింది. రచ్చ రచ్చ చేసింది. కానీ ఇప్పుడు ఆమె ని మించిపోయింది మృణాల్ ఠాకూర్‌. ప్రస్తుతం ఈ బ్యూటీ ట్రెండింగ్‌గా మారింది.   

PREV
112
ఆ విషయంలో తమన్నాని మించిపోయిన మృణాల్‌ ఠాకూర్.. `లస్ట్ స్టోరీస్‌2` బెడ్‌ సీన్‌ ట్రెండింగ్‌.. నెటిజన్ల గోల

మృణాల్‌ ఠాకూర్‌ తాజాగా `లస్ట్ స్టోరీస్‌ 2`లో నటించింది. గతంలో వచ్చిన బోల్డ్ ఓటీటీ ఫిల్మ్ `లస్ట్ స్టోరీస్‌`కిది సీక్వెల్‌. మహిళల ఫీలింగ్స్, వారి స్వేచ్ఛ ప్రధానంగా రూపొందిన నయా ఆంథాలజీ ఫిల్మ్. నెట్‌ ఫ్లిక్స్ దీన్ని రూపొందించింది. ఇందులో ఇలాంటి బోల్డ్ కంటెంట్‌కి బాగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో సీక్వెల్‌ని తెరకెక్కించింది.

212

ఇందులో నాలుగైదు స్టోరీస్‌గా ఈ సిరీస్‌ రూపొందింది. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ ఓ స్టోరీలో కనిపించబోతుంది. తాజాగా ఈ రోజు నుంచి `లస్ట్ స్టోరీస్‌ 2` స్ట్రీమింగ్‌ అవుతుంది. దీంతో ఈ సిరీస్‌ని చూసిన నెటిజన్లు వాటిలోని హైలైట్‌ సీన్లని క్లిప్పులుగా కట్ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 
 

312

అందులో భాగంగా ఇప్పుడు మృణాల్‌ ఠాకూర్‌ సీన్లు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంటర్నెట్‌లో ఈ అమ్మడి బోల్డ్ సీన్లు ట్రెండ్‌ అవుతుంది. సోషల్‌ మీడియాని ఊపేస్తున్నాయి. ప్రధానంగా రెండు క్లిప్పులు సంచలనంగా మారాయి. 
 

412

వాటిలో ఒకటి తన ప్రియుడు, చేసుకోబోయే వాడితో మృణాలో కారులో రొమాన్స్ చేస్తుంది. లిప్‌ కిస్సులతో రెచ్చిపోతుంటారు. ఇది ఓ పోలీస్‌ చూడటంతో దాన్ని కవర్‌ చేస్తారు. ప్రస్తుతం క్లిప్‌ నెట్టింట రచ్చ చేస్తుంది.ఇదే అంటే దీన్ని మించి మరోటి ఉంది. 
 

512

ఇందులో హైలైట్‌గా నిలిచే మరో సీన్‌... బెడ్‌ సీన్‌. ఈ క్లిప్‌ అన్ని సామాజిక మాధ్యమాలను ఊపేస్తుంది. ఇంకా చెప్పాలంటే సోషల్‌ మీడియాని బ్రేక్‌ చేస్తుంది. థర్మామీటర్లు పగిలిపోయేలా ఈ సీన్‌ ఉండటం విశేషం. ప్రియుడితో ఘాటు రొమాన్స్‌ లో ఉన్న సీన్‌ ఇది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
 

612

ఈ సీన్‌ గురించే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. మృణాల్‌ ఈ రేంజ్‌లో చేసిందేంటి? అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతటి బోల్డ్ గానా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది అభిమానులు షాక్‌లోకి వెళ్లారు. ముఖ్యంగా `సీతారామం`లో సీతామహాలక్ష్మిగా ఆమెని అభిమానించిన ఫ్యాన్స్ మాత్రం గగ్గోలు పెట్టుకుంటున్నారు.

712

ఇటీవల తమన్నా `జీ కర్దా` అనే వెబ్‌ సిరీస్‌ చేసింది. ఇందులో ప్రియుడితో కలిసి బెడ్‌ సీన్లలో నటించింది తమన్నా. ఇంకా చెప్పాలంటే నెవర్‌ బిఫోర్‌ అనేలా ఆ సీన్లలో యాక్ట్ చేసి సంచలనంగా మారింది. దీంతో ఆమెపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. కొన్ని రోజులపాటు చిత్రపరిశ్రమలో తమన్నానే హెడ్‌లైన్‌గా మారడం విశేషం. 

812

ఇక ఇప్పుడు తమన్నాని మించిపోయింది మృణాల్‌ ఠాకూర్‌. బెడ్‌ సీన్‌లో ఆమె రెచ్చిపోయి యాక్ట్ చేసింది.  దీంతో తమన్నాని మించి రెచ్చిపోయిన సీతామహాలక్ష్మి అంటూ ట్రోల్స్ స్టార్ట్ చేశారు నెటిజన్లు. ఇప్పుడు మొత్తం మృణాల్‌ సీన్ల గురించే చర్చ జరుగుతుండటం గమనార్హం. 
 

912

`లస్ట్ స్టోరీస్‌`లో మృణాల్‌తోపాటు తమన్నా, కాజోల్‌, మరో జంట నటించారు. మొత్తం నాలుగు స్టోరీస్‌. నలుగురు దర్శకులు. ఈ ఓటీటీ ఫిల్మ్ తెగ వైరల్‌ అవుతుంది. చూడబోతుంటే మొదటి సిరీస్‌ని దాటేసేలా ఉంది. 
 

1012

ఇక మృణాల్‌ హీరోయిన్‌గానూ బిజీగా ఉంది. ఆమె `సీతారామం` చిత్రంలో సీతామహాలక్ష్మిగా యాక్ట్‌ చేసి అందరిని ఆకట్టుకుంది. సీతాగానే ఆడియెన్స్ లో మిగిలిపోయింది. ఆ తర్వాత బోల్డ్ అందాల ప్రదర్శనలో కనిపించి షాక్‌ ఇచ్చింది. తనలో మరో కోణం ఉందని చాటి చెప్పింది. దీంతో నెమ్మదిగా ఆ విషయాన్ని డిజైస్ట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఫ్యాన్స్‌. 
 

1112

ప్రస్తుతం మృణాల్‌ ఠాకూర్‌ తెలుగులో `నాని30`తోపాటు విజయ్‌ దేవరకొండతో `వీడీ13` చిత్రంలో నటిస్తుంది. హిందీలో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. 
 

1212

మృణాల్‌ ఠాకూర్‌ యంగ్‌ హీరోల నుంచి స్టార్‌ హీరోల వరకు వారి సరసన నటించే హీరోయిన్‌గా బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. అందుకే ఈ బ్యూటీకి నెమ్మదిగా అవకాశాల జోరు స్టార్ట్ అవుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories