ప్లాప్ అయితేనేం... వీటికున్న క్రేజ్ మాటల్లో చెప్పలేం!

First Published Jul 16, 2019, 12:26 PM IST

టాలీవుడ్ లో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు. 

టాలీవుడ్ లో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు. అలా ఫ్లాప్ అయిన సినిమాలకు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ చాలా మంది 'ఖలేజా' సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి సినిమాలేవో ఇప్పుడు ఓ లుక్కేద్దాం!
undefined
ఆరెంజ్ - ఈ సినిమాలో ఉన్న రియాలిటీని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారేమో కానీ.. ఈ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే మిస్ కాకుండా చూసేవాళ్లు చాలా మంది ఉన్నారు.
undefined
నేనొక్కడినే - మహేష్ బాబు నటించిన ఈ సినిమాకి అప్పట్లో ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమాను ఇష్టపడే వారు కూడా ఉన్నారు.
undefined
ఓయ్! - తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్ లో ఈ సినిమా కూడా ఒకటి. కానీ ఈ సినిమా ఎందుకు సరిగ్గా ఆడలేదో అర్ధంకాని విషయం. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తాయి.
undefined
ఖలేజా - హీరోని దేవుడు చేయడం జనాలకి అర్ధం కాలేదు. ఆ దేవుడనే కాన్సెప్ట్ గనుక లేకపోతే రిజల్ట్ మరోలా ఉండేదేమో.. కానీ ఈ సినిమాలో మహేష్ కామెడీ టైమింగ్ కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు.
undefined
జగడం - యూత్, గొడవల కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో రామ్ తన పెర్ఫార్మన్స్ తో మెప్పించాడు. ఈ సినిమా ఫ్లాప్ అయినా ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు.
undefined
ప్రస్థానం - నటుడిగా శర్వాకి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా ఇది. అయితే ఈ సినిమా బాగుందనే టాక్ బయటకి వచ్చేలోపు సినిమాను థియేటర్ లో నుండి తీసేశారు.
undefined
నేనింతే - సినిమా వాళ్ల కష్టాలను వెండితెరపై కళ్లకు అద్దినట్లు చూపించారు. ఈ సినిమాకి చాలా మంది అభిమానులు ఉన్నారు.
undefined
తీన్మార్ - సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రను పోషించారు. అందులో అర్జున్ అనే క్యారెక్టర్ ఆడియన్స్ ని బాగా మెప్పించింది. కానీ సినిమాకి మాత్రం హిట్ టాక్ రాలేదు. కానీ సెపరేట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఇప్పటికీ సినిమా పాటలు వినిపిస్తూనే ఉన్నాయి.
undefined
ఎటో వెళ్లిపోయింది మనసు - స్కూల్ డేస్ లో మొదలైన ప్రేమ కథ ఎన్ని మలుపులు తీసుకొని చివరికి ఒక్కటవుతారో ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా ఫ్లాప్ అయినా రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారు.
undefined
వేదం - ఈ సినిమాతో మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు క్రిష్. సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అవ్వకపోయినా.. చాలా మంది ఈ సినిమాను ఇష్టపడతారు.
undefined
నేను మీకు తెలుసా..? - మంచు మనోజ్ నటించిన వైవిధ్యమైన చిత్రాల్లో ఇదొకటి. కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు.
undefined
ఒక లైలా కోసం - చైతు నటించిన ఈ సినిమా జనాలకు పెద్దగా ఎక్కలేదు కానీ చాలా మంది టీనేజర్స్ ఈ సినిమాను ఇష్టపడతారు.
undefined
ఫలక్ నుమా దాస్ - సినిమాలో బూతులు ఎక్కువయ్యాయని విమర్శలు వచ్చినప్పటికీ కొంతమంది ప్రేక్షకులకు ఈ సినిమా బాగానే నచ్చింది.
undefined
ఈ నగరానికి ఏమైంది..? - 'పెళ్లిచూపులు' తరువాత తరుణ్ భాస్కర్ రూపొందించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా అంచనాలను రీచ్ కాలేకపోయింది. అయినప్పటికీ యూత్ లో చాలా మంది ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు.
undefined
click me!