Mouni Roy : పోస్ట్ వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన ‘మౌనీరాయ్’ .. పట్టుచీరలో మెరిసిపోతున్న ‘నాగిని’

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 03, 2022, 02:43 PM ISTUpdated : Feb 03, 2022, 03:28 PM IST

‘నాగిని’ఫేమ్, కొత్త పెళ్లి కూతురు మౌనీ రాయ్ సంప్రదాయ దుస్తుల్లో దేవతలా కనిపిస్తోంది. తన వివాహా వేడుకుల తర్వాత  మౌనీ రాయ్ తాజాగా సోషల్ మీడియాలో మెరిసింది.    

PREV
16
Mouni Roy : పోస్ట్ వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన ‘మౌనీరాయ్’ .. పట్టుచీరలో మెరిసిపోతున్న ‘నాగిని’

బుల్లితెర సీరియల్స్ తో నటి మౌనీరాయ్ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా నాగిని టీవీ సిరీస్ తో మౌనీరాయ్ తిరుగులేని ఖ్యాతి సొంతం చేసుకుంది  మౌనీ రాయి. 
 

26

నాజూకైన అందంతో నాగిని టీవీ సిరీస్ లో మౌనీరాయ్ అలరించింది. అలాగే సినిమాల్లో కూడా ఈ భామ నటించింది. కేజీఎఫ్ హిందీ వర్షన్ చిత్రంలో మౌనీరాయ్ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. 

36

కాగా, వ్యాపార‌వేత్త‌ సూర‌జ్ నంబియార్‌ తో చాలా కాలంగా మౌనీ రాయ్ ప్రేమలో ఉండగా..  జనవరి 27న గోవాలో మలయాళి, బెంగాలి సంప్రదాయ పద్దతదుల్లో  వివాహాం చేసుకున్నారు. వీరి వివాహా వేడుకల సందడి అంబరాన్ని అంటింది.  

46

నాజూకు అందాలతో అభిమానులని సొంతం చేసుకున్న మౌనీ రాయ్ సంప్రదాయ పెళ్లి వస్త్రధారణలో మరింత అందంగా కనిపిస్తోంది. అయితే తాజాగా పోస్ట్ వెడ్డింగ్ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. 

56

ఎరుపు రంగు పట్టు చీరలో  జ్యూవెల్లరి ధరించడంతో మౌనీరాయ్ మహారాణిలా కనిపిస్తోంది. అయితే ఈ ఫొటోలను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. తమ వివాహానికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్ దొరికినందుకు హ్యాపీ గా ఉందని తెలిపింది. 
 

66

ఈ మేరకు తన ఫొటోలతో పాటు, ఆమె భర్తతో కలిసి దిగిన ఫొటోను కూడా అభిమానులతో పంచుకుంది మౌనీరాయ్. నెటిజన్లు స్పందిస్తూ స్వీట్ కంపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.   

click me!

Recommended Stories