సినీ తారలు రాజకీయాల్లో రాణించడం చాలా కాలం నుంచి చూస్తున్నాం. ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వరకు చాలా మంది సినీ తారలు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కొంతకాలం తర్వాత రాజకీయాల నుంచి వెనుదిరిగిన వారు కూడా ఉన్నారు. హీరోయిన్లు కూడా నటనలో కొనసాగుతూనే రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. సీనియర్ నటీమణులు జయసుధ, జయప్రద, రోజా, శారద లాంటి వారు రాజకీయాల్లో రాణించారు.