Meher Ramesh: హిట్లు కంటే డిజాస్టర్లు, ట్రోల్సే ఎక్కువ..ఇంతకాలం ఇండస్ట్రీలో ఎలా నిలబడ్డారు? వర్క్ విషయంలో మాత్రం తాట తీస్తారంట

Published : Jul 02, 2026, 01:05 PM IST

Meher Ramesh: కొంతమంది డైరెక్టర్లు హిట్లతో గుర్తింపు తెచ్చుకుంటే..మరికొందరు డైరెక్షన్, కాన్సెప్ట్ తో గుర్తుండిపోతారు. కానీ ఒక డైరెక్టర్ కెరీర్ లో హిట్లు కంటే డిజాస్టర్లే ఎక్కువ. అయినా దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఎలా? హీరోలు ఎందుకు ఒప్పుకుంటున్నారు? 

PREV
16
పెద్ద హీరోలు ఆయన సినిమాలు చేయడానికి కారణమేంటి?

దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు మెహర్ రమేశ్. ఇన్నేళ్లుగా ఒక్కటంటే ఒక్క హిట్ లేకపోయినా కూడా నెట్టుకుంటూ వస్తున్నారు. అసలు వరుస విమర్శలు, ఫ్లాప్‌లు ఎదురైనా ఆయనకు అవకాశాలు ఎలా వస్తున్నాయి. పెద్ద హీరోలు కూడా ఆయన సినిమాలు చేయడానికి కారణమేంటి? 

26
దర్శకధీరుడు రాజమౌళితో ఫ్యామిలీ ఫ్రెండ్షిప్

మెహర్ రమేశ్ దర్శకుడిగా మారకముందు ఆయన పలు ఇండస్ట్రీలో కొన్ని విభాగాల్లో పనిచేశారు. మహేశ్ బాబు బాబీ సినిమాలోనూ యాక్ట్ చేశారు. అయితే మెహర్ రమేశ్ సినిమా ఇండస్ట్రీలో ఇంకా కొనసాగడానికి కారణం...దర్శకధీరుడు రాజమౌళితో ఉన్న కుటుంబ బంధం కారణమని చర్చ ఉంది. అయితే, ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చిన తర్వాత వాటిని నిలబెట్టుకోవడం మాత్రం ప్రతి ఒక్కరి సొంత ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. 

36
బిల్లా తప్పా మిగతావన్నీ భారీ డిజాస్టర్లే

మెహర్ రమేష్ దర్శకుడిగా తన ప్రయాణాన్ని కన్నడ చిత్ర పరిశ్రమతో ప్రారంభించారు. ఆ తర్వాత తెలుగులో పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కించుకున్నారు. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేయడంతో టాలీవుడ్ లో ఆయన పేరు ఒక్కసారిగా వినిపించింది. కన్నడలో వీర కన్నడిగ, అజయ్ సినిమాలతో బాక్ టు బాక్ హిట్లు కొట్టారు. ఆ తర్వాత కంత్రి, బిల్లా, శక్తి, షాడో, భోళాశంకర్ తీశారు. వీటిలో బిల్లా తప్పా మిగతావన్నీ భారీ డిజాస్టర్లే. భోళాశంకర్ సినిమా...చిరంజీవి కెరీర్ లో అట్టర్ ప్లాప్ మూవీ ఇది. 

46
మీమ్స్‌గా మారిన ఆయన సినిమాలు

మెహర్ రమేష్ కెరీర్‌లో అన్ని భారీ బడ్జెట్ సినిమాలే. కొన్ని సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, హైప్ ఉన్నప్పటికీ ఫలితం ఆశించిన విధంగా రాకపోవడంతో సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. చివరకు ఆయన సినిమాలు మీమ్స్‌గా మారాయి. దీంతో కొత్త సినిమా వచ్చిన ప్రతిసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా పెరిగింది. 

56
మెహర్ రమేష్ గురించి చాలా మందికి తెలియని విషయం

ఇండస్ట్రీలో విజయం ఒక్కటే ప్రమాణం కాదు. ఒక దర్శకుడు సెట్‌లో ఎలా పని చేస్తాడు, నిర్మాత బడ్జెట్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడు, హీరోతో ఎలా వ్యవహరిస్తాడు, షూటింగ్‌ను ఎంత క్రమశిక్షణగా పూర్తి చేస్తాడు వంటి అంశాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఇండస్ట్రీలో మెహర్ రమేష్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తారనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అందుకే విమర్శలు వచ్చినా ఆయనకు అవకాశాలు పూర్తిగా ఆగిపోలేదు.

స్టార్ హీరోలతో పని చేయాలంటే కేవలం కథ సరిపోదు. నమ్మకం కూడా ఉండాలి. మెహర్ రమేష్‌కు ప్రముఖ హీరోలు, నిర్మాతలతో మంచి అనుబంధం ఉంది. అదే ఆయన కెరీర్‌కు బలం. ఎన్ని ట్రోల్స్, విమర్శలు వచ్చినా...మెహర్ మాత్రం ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోనని, ప్రతి సినిమా ఒక పాఠమేనని ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇదే ఆయనపై గౌరవాన్ని పెంచింది.

66
మెహర్ రమేష్ ఇంకా ఇండస్ట్రీలో కొనసాగడానికి ప్రధాన కారణాలు

సినీ కుటుంబాలతో మంచి సంబంధాలు, నిర్మాతలతో ప్రొఫెషనల్ వ్యవహారం, స్టార్ హీరోలతో ఏర్పడిన నమ్మకం, విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ప్రయత్నించడం, కొత్త అవకాశాల కోసం నిరంతరం పనిచేయడమేనని చెప్తారు.

సినిమా రంగంలో ప్రతి దర్శకుడి కెరీర్ ఒకేలా ఉండదు. కొందరికి వరుస విజయాలు వస్తాయి. మరికొందరు వరుస పరాజయాలను ఎదుర్కొంటారు. కానీ విమర్శలు, ట్రోల్స్ మధ్య కూడా ఇండస్ట్రీలో కొనసాగడం అంత తేలిక కాదు. ఆ కోణంలో చూస్తే మెహర్ రమేష్ ప్రయాణం ప్రత్యేకంగా కనిపిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories