Brigida Saga: స్టార్‌ డైరెక్టర్‌ కి హ్యాండిచ్చిన హీరోయిన్‌.. ప్రియుడిని పరిచయం చేస్తూ సంచలన పోస్ట్

Published : Jul 02, 2026, 12:54 PM IST

తెలుగులో `సింధూరం`, `పెదకాపు` చిత్రాల్లో నటించిన బ్రిగిడా సాగా ఒక స్టార్‌ డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె తన ప్రియుడిని పరిచయం చేయడం షాకిస్తోంది. 

PREV
15
ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్

తమిళంలో పాపులర్‌ అయిన హీరోయిన్‌ బ్రిగిడా సాగా తన బాయ్‌ ఫ్రెండ్‌ ని పరిచయం చేసింది. నటుడు అనంత్‌తో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఆమె పంచుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇదే ఇప్పుడు వైరల్‌గా, సంచలనంగా మారింది. అయితే బ్రిగిడా టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

25
టాలీవుడ్‌ డైరెక్టర్‌తో బ్రిగిడా సాగా ఎఫైర్‌

టాలీవుడ్‌ దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల, బ్రిగిడా సాగా ప్రేమలో ఉన్నట్టు గత కొంత కాలంగా వార్తలు వచ్చాయి. తన భార్య అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన ఈ హీరోయిన్‌తోనే చాలా కాలంగా ఉంటున్నట్టు వార్తలు గుప్పు మన్నాయి. ఒక అజ్ఞాత వ్యక్తి మీడియా వారికి ఈ విషయాన్ని లీక్‌ చేశాడు. భార్యకి అన్యాయం చేస్తూ, ఇలా చేస్తున్నాడనే సందేశాలు పంపించారు.

35
రూమర్లకి చెక్ పెడుతూ బ్రిగిడా ఎమోషనల్‌ పోస్ట్

దాదాపు రెండు మూడేళ్లుగా ఈ వార్తలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో ఈ వార్తలకు, రూమర్లకి చెక్‌ పెట్టింది బ్రిగిడా సాగా. తాజాగా తన బాయ్‌ ఫ్రెండ్‌ని పరిచయం చేయడం విశేషం. ఇందులో ఆమె ప్రియుడిని ఉద్దేశించి ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. ఇందులో ఆమె చెబుతూ, `చిన్నప్పుడు అందమైన ప్రేమ కథలు కేవలం సినిమాల్లోనే ఉంటాయని నమ్మేదాన్ని, సినిమా పూర్తయి, తెరపై పేర్లు పడిపోయిన తర్వాత కూడా మనసులో అలాగే నిలిచిపోయే కథలవి, కానీ లైఫ్‌ మరోలా ప్లాన్‌ చేస్తుంది. సినిమా రంగంంలో నా ప్రయాణంలో, నాలాంటి కలనే కంటూ, దాన్ని అంతే గౌరవించే ఒక వ్యక్తి నాకు పరిచయమయ్యాడు. అతను నా లవ్‌ లైఫ్‌గా మారకముందే, నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు.

45
సినిమాలోని ప్రేమ కథ నిజమైతే

అత్యంత అందమైన ప్రేమ కథలు ఎప్పుడూ కేవలం తెర కోసం మాత్రమే రాయబడవు, అవి నాకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. కొన్నిసార్లు అవి నిజ జీవితంలోనే అందంగా సాగుతాయి. ఇదిగో, మా ప్రపంచంలోని ఒక చిన్న భాగం మీకోసం. మేం ఎప్పుడూ ఐ లవ్‌ యూ అని చెప్పుకునే రకం కాదు. ఆ ప్రయాణంలో ఎక్కడో ఒక చోట, ఆ మాటలు మరోలా మారిపోయాయి. ఇది కేవలం మాకు మాత్రమే సొంతమైన పదం. ఈ రోజు మా ప్రపంచంలోని ఆ చిన్న భాగాన్ని మీతో పంచుకుంటున్నాం` అని ఎమోషనల్‌ కామెంట్‌ చేసింది బ్రిగిడా సాగా. ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. అదే సమయంలో దర్శకుడితో ఎఫైర్ అనే రూమర్లో నిజం లేదని తెలుస్తుంది. మరి ఇదే నిజమా? డైరెక్టర్‌కి హ్యాండిచ్చి ప్రియుడిని చూసుకుందా? అనేది తెలియాల్సి ఉంది. 

55
బ్రిగిడా నటించిన సినిమాలు

బ్రిగిడా సాగా.. తెలుగులో `పెదకాపు`, `సింధూరం` అనే చిత్రాల్లో నటించింది. పెదకాపు చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు కావడం విశేషం. ఆ తర్వాత నుంచే వీరిద్దరు లవ్‌లో ఉన్నట్టు టాక్‌. ఇక బ్రిగిడా తమిళంలో మాత్రం మంచి సినిమాలు చేసింది. `అయోగ్య`, `వర్మా`, `మాస్టర్‌`, `వేలన్`, `ఇరవిన్‌ నిజల్‌`, `గరుడన్‌`, `కొజిపన్నై చెల్లదురై`, `ఇడ్లీ కడై`, `హాట్‌ స్పాట్‌ 2 మచ్‌` అనే చిత్రాల్లో నటించింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories