Karthika Deepam: సీన్‌లోకి మోనిత బాబాయ్ ఎంట్రీ.. ముసలి కన్నీరు పెట్టిన మోనిత.. అసలు ట్విస్ట్ ఏమిటంటే?

Navya G   | Asianet News
Published : Feb 15, 2022, 09:44 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నాటకాలు ఆడడం నీకేమి కొత్తకాదు మోనిత భోజనం చేసి నీ దారిన వెళ్ళిపో వంటలు నేనే చేశాను అని  దీప (Deepa)  వెటకారం గా అంటుంది.  

PREV
15
Karthika Deepam: సీన్‌లోకి మోనిత బాబాయ్ ఎంట్రీ.. ముసలి కన్నీరు పెట్టిన మోనిత.. అసలు ట్విస్ట్ ఏమిటంటే?

అంతేకాకుండా ఎం ఆలోచిస్తున్నావు మోనిత (Monitha)  మా ఇద్దరి తో సెల్ఫీ తీసుకుంటావా అంటూ దీప ఒక సెల్ఫీ తీస్తుంది. దాంతో మోనిత చిరాకు పడి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక ఆ తర్వాత మోనిత కు వాళ్ళ బాబాయ్ ఫోన్ చేయగా నీకు నేనున్నాను బాబాయ్ అంటూ చెబుతుంది. అంతేకాకుండా నీకు కార్తీక్తో వైద్యం చేయించే బాధ్యత నాది, కార్తీక్ (Karthik)  నా భర్త అని చెబుతోంది.

25

అంతేకాకుండా 'మీరు ఇక్కడికి వచ్చేయండి బాబాయ్ మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను' అని కపట ప్రేమ తో మాట్లాడుతుంది మోనిత. ఆ తర్వాత  కార్తీక్ (Karthik)  దగ్గరవడానికి బాబాయిని వాడుకుంటాను అని నవ్వుకుంటూ అనుకుంటుంది. మరోవైపు కార్తిక్ కి సౌందర్య (Soundary) తన చేతితో అన్నం తినిపిస్తూ ఉంటుంది.
 

35

ఇక ఆ తర్వాత దీప  (Deepa) అక్కడికి వచ్చి అత్తయ్య నేను బస్తీ కి వెళ్లి వస్తాను అని అంటుంది. దాంతో ఫ్యామిలీ అంతా ఆశ్చర్యపోయి మోనిత గతంలో చేసిన రచ్చ గురించి చెబుతారు. అదీ కాకుండా మోనిత హాస్పిటల్ కూడా బస్తీ కి షిఫ్ట్ చేసిన విషయం చెప్పి ఇలాంటి టైమ్ లో బస్తికి అవసరమా అని సౌందర్య (Soundarya) అంటుంది.
 

45

మరోవైపు మోనిత (Monitha) ఇంటికి వాళ్ళ బాబాయ్ వస్తాడు. ఇక మోనిత ముసలి కన్నీరు కారుస్తూ బాబాయ్ గతంలో మిమ్మల్ని నేను ఏమైనా ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి అంటూ కాళ్ళు పట్టుకుంటుంది. మరోవైపు కార్తీక్.. డాక్టర్ కార్తీక్ (Karthik) లా హాస్పిటల్ కి వెళ్తాడు.

55

అక్కడ జరిగిన చేదు జ్ఞాపకాలను ఊహించుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడకు ఒక లేడీ డాక్టర్ వచ్చి ' సార్ మీరు వచ్చినప్పుడు మోనిత (Monitha) మేడం గారు ఇన్ఫామ్ చేయమన్నారు చేయాలా వద్దా సార్ ' అని అడుగుతుంది. ఇక కార్తీక్ (Karthik) అక్కర్లేదు అని చెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి ఎపిసోడ్ లో ఎలాంటి ట్విస్ట్ చోటుచేసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. 

click me!

Recommended Stories