Karthika Deepam: హిమను చంపాలి అనుకున్న మోనిత.. కార్తీక్ ని మోనితకు ఇచ్చేయాలి అనుకున్న దీప?

First Published | Jan 21, 2023, 8:07 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు జనవరి 21వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్లో ముందు ఆ మోనిత ఎక్కడ ఉందో తెలుసుకోవాలి డాక్టర్ బాబు ఫోన్ ని బట్టి ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు కదా అని అంటుంది. ఇంతలోనే వారణాసి దీపకి ఫోన్ చేసి నీ అనుమానమే నిజమైంది దీపక్క ఆ మోనిత ఇంట్లోనే ఉంది అనడంతో అప్పుడు దీప ఆవేశం సౌందర్యలకు చెప్పగా అందరూ ఆశ్చర్యపోతారు. సరే వారణాసి నువ్వు అక్కడే ఉండు మేము వస్తున్నాము అని దీప ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు దీప వాళ్లు అక్కడి నుంచి బయలుదేరుతారు. మరొకవైపు మోనిత గన్ వైపు చూస్తూ నా ఓపికకి నా సహనానికి నువ్వు పరీక్ష పెడుతున్నావు. నీ ప్రాణాలు ఆ దేవుడు తీసుకుపోతున్నాడు కదా అని నేను ఓపిక పడదామని అనుకున్నాను. కానీ ఇక నావల్ల కాదు నీ చావు నా చేతుల్లోనే అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

 అప్పుడు నాకు దక్కని కార్తీక్ ని ఇంకెవరికి దక్కకూడదు కాబట్టి ఈ బాంబు పెట్టి చంపేస్తాను అని బాంబు వైపు చూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి హిమ వచ్చి ఏం చేస్తున్నారు ఆంటీ అనడంతో ఏం లేదు అని కంగారుపడుతుంది. మీ డాడీ ఒప్పుకోకపోతే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను హిమ అనగా అదేంటి ఆంటీ ఇలా అంటున్నారు మా డాడీ ఒప్పుకుంటారని మీరే అన్నారు కదా మరి ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అంటుంది హిమ. అప్పుడు హిమకు మాయ మాటలు చెప్పి లోపలికి పంపిస్తుంది మోనిత. తర్వాత మోనిత చేతిలో గన్ను తీసుకొని మీ డాడీని ఒప్పిస్తానే కానీ అది మీ అమ్మని బ్రతికించడానికి కాదు నన్ను పెళ్లి చేసుకోవడానికి అనుకుంటూ నవ్వుతూ ఉంటుంది.


మరొకవైపు దీప దేవుడిని కోరుకుంటూ నేను సంతోషంగా బతకాలని కోరుకున్నాను. కానీ ఎందుకు ఇలా మధ్యలోనే తీసుకుపోతున్నావు అయితే ఎందుకు అని నేను అడగను. నువ్వు ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది కదా అని దేవుడు ముందు మాట్లాడుతూ ఉంటుంది దీప. అలాగే నేను ఈరోజు ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను అది ఎలా అయినా అమలు అయ్యేలా చూడు అని అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య నేను ఆయన ఒక కారులో వస్తాను నువ్వు సౌర్యకు కారులో రండి అనడంతో సరే అని అందరూ అక్కడ నుంచి బయలుదేరుతారు. తర్వాత దీప కాకార్తీక్ కార్ లో వెళుతుండగా తొందరగా వెళ్ళండి. డాక్టర్ బాబు దానికి ఎంత ధైర్యం నా బిడ్డనే కిడ్నాప్ చేస్తుందా అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది దీప. 
 

హిమ మనసు పాడు చేసింది నేను నిన్ను బతికించుకోవడం ఇష్టం లేదు అని హిమ మనుసులో అనుమానపు బీజం నాటేసింది అని అంటాడు కార్తీక్. హిమను కాపాడుకోవాలి లేదంటే మీరు దానిని పెళ్లి చేసుకోవాలి అనడంతో ఆ రెండు నేను జరగకుండా నేను చూసుకుంటాను దీపా అని అంటారు కార్తీక్. అది చాలా మొండిది డాక్టర్ బాబు అనుకున్నది సాధిస్తుంది అంటుంది దీప. నేను పోయే ముందు నాకు ప్రశాంతత లేకుండా చేయాలని చూస్తోంది లేకుండా చేసేసింది అంటుంది దీప. నువ్వు భయపడకు దీప హిమను కాపాడుకొని ఆ మోనిత నిజ స్వరూపం హిమకు తెలిసేలా చేద్దాం అని అంటారు. మరోవైపు సౌందర్య సౌర్య ఒక కారులో వెళుతూ నానమ్మ ఆ మోనిత ఎందుకు ఇలా చేస్తుంది ఏం కావాలి అనడంతో మీ నాన్న కావాలంట ఎప్పటినుంచో ఇలా ప్రవర్తిస్తుంది అని అంటుంది సౌందర్య.
 

ఇదంతా ఆ హిమ వల్లే నానమ్మ మనమందరం మా మోనిత ఆంటీను తిడుతున్న కూడా అది పట్టించుకోకుండా మళ్ళీ ఆ మోనిత దగ్గరికి వెళ్ళింది అని అనుకుంటూ ఉంటుంది. ఇదంతా కాదు శౌర్య మనం ఆ మోనిత పీడ ఎలా విరగడ చేయాలో అది ఆలోచించాలి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు కార్తీక్ దీప వెళ్లి మోనిత ఇంట్లో బయటికి రా మోనిత అని అరుస్తూ ఉండగా ఇంతలోనే మోనిత హిమకు గన్ను పెట్టి బెదిరించి అక్కడికి వస్తుంది. అప్పుడు హిమ హిమ డాడీ అని ఏడుస్తుండగా దీప టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు దీప దగ్గరికి రావద్దు హిమను కాల్చేస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తుంది.
 

అప్పుడు కార్తీక్ మన మధ్య ఏదైనా ఉంటే మనం తేల్చుకుందాము పిల్లలను వదిలేయ్ అనడంతో మన మధ్య ఏమి కుదరడం లేదు అందుకే ఇలా ట్రై చేస్తున్నాను అంటుంది మోనిత. ఇంతలోని సౌందర్య సౌర్య  అక్కడికి వస్తారు. మీరందరూ ఇక్కడే ఉన్నారు అందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకోండి అని అంటుంది. నేను కూడా ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నాను ఆంటీ మీరు నేను చెప్పిన దానికి ఒప్పుకోకపోతే మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని ఒకేసారి లేపేస్తాను అనుకుంటూ ఉంటుంది మోనిత. ఇప్పుడు మోనిత మనవరాలిని చంపేస్తాను అని బెదిరిస్తుండగా దీప సౌందర్య ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు.

బాగా ఆలోచించు దీప నీ కూతురు కావాలి అంటే నీకు కూతుర్ని ఇచ్చేస్తాను. నీ భర్తను నాకు అప్పగించు అని అంటుంది. అప్పుడు కార్తీక్ ని ఇస్తావా లేకపోతే హిమను చంపేయమంటావా అనడంతో దీప ఏడుస్తూ ఉంటుంది. మోనిత హిమను ఏం చేస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు మోనిత ప్లీజ్ నా బిడ్డను ఏం చేయకు డాక్టర్ బాబు ని నీకు అప్పగిస్తాను అనడంతో మోనిత సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు దీప ఏం చేయాలి అత్తయ్య ఇది తప్ప మరొక మార్గం లేదు అని అనడంతో అందరూ షాక్ అవుతారు. డాక్టర్ బాబు మనకు మన కూతురు కావాలంటే నువ్వు మోనిత నీ పెళ్లి చేసుకోవాల్సిందే అనడంతో సౌందర్య కార్తీక్ షాక్ అవుతారు.
 

నేను బాగా ఆలోచించాను మోనిత నీకంటే ఎవరూ కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది అనడంతో మోనిత సంతోష పడుతూ ఉంటుంది. నీ చేతిలోనే నా కుటుంబం సంతోషంగా ఉంటుంది అనడంతో ఇదంతా నిజమేనా అని మోనిత సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు దీప వెంటనే గన్ను తీసుకొని మోనితకీ గురిపెట్టి హిమను కాపాడుకుంటుంది. ఎంత ధైర్యం దీప నీకు అనడంతో దగ్గరికి రావద్దు చంపేస్తాను అంటుంది దీప.

Latest Videos

click me!