OTT Movie: ఓటీటీలోకి సూపర్‌హిట్‌ ఫ్యామిలీ థ్రిల్లర్‌.. ఒక్క కేసు చుట్టూ మూడు సినిమాలు

Published : Jun 13, 2026, 04:18 PM IST

మోహన్‌లాల్‌ హీరోగా నటించిన సూపర్‌ హిట్‌ మూవీ `దృశ్యం 3`. గత నెలలో విడుదలై రెండు వందల కోట్లు రాబట్టిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్‌ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. రిలీజ్‌ డేట్‌ లాక్‌ అయ్యింది. 

PREV
14
మలయాళంలో సూపర్‌ హిట్‌ దృశ్యం 3

మోహన్‌ లాల్‌ హీరోగా నటించిన సూపర్‌ హిట్‌ మూవీ `దృశ్యం 3`. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో మీనా.. మోహన్‌లాల్‌కి జోడీగా నటించగా, అన్సిబా హసన్‌, ఎస్తర్‌ అనిల్‌, సిద్ధిఖీ, ఆశా శరత్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ మలయాళంలో రూపొందింది. మే 21న  విడుదలైంది. మలయాళంతోపాటు తెలుగులోనూ విడుదలైంది. కానీ మన ఆడియెన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ మలయాళంలో మాత్రం బాగానే ఆడింది. అక్కడ పెద్ద హిట్‌ అయ్యింది.

24
దృశ్యం 3 కలెక్షన్లు

మలయాళంలో భారీ వసూళ్లని రాబట్టింది. ఈ చిత్రం అక్కడ ఏకంగా రూ.200కోట్లు వసూలు చేసింది. మిక్స్ డ్‌ టాక్‌తోనూ అక్కడ ఇంత పెద్ద హిట్‌ కావడం విశేషం. మోహన్‌లాల్‌ ఇమేజ్‌తో ఆడేసిందని చెప్పొచ్చు.  మోహన్‌ నటించిన చిత్రాల్లో రెండు వందల కోట్లు సాధించిన సినిమాల జాబితాలో `దృశ్యం 3` కూడా చేరింది. ఈ మూవీ ఇప్పుడు నెల రోజులకు ముందుగానే ఓటీటీలో రాబోతుంది. థియేట్రికల్‌గా రన్‌ ముగియడంతో ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నారు. వచ్చే వారం ఇది ఓటీటీ ఆడియెన్స్ ని అలరించబోతుంది.

34
దృశ్యం 3 ఓటీటీ రిలీజ్‌ డేట్‌

`దృశ్యం 3` ఓటీటీ రైట్స్ ని అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఈ నెల 18 నుంచి ప్రైమ్‌ వీడియోస్‌లో స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఎందుకంటే థియేటర్లో తెలుగు ఆడియెన్స్  పెద్దగా పట్టించుకోలేదు. ఓటీటీ కోసం వెయిట్‌ చేస్తున్నారు. జూన్‌ 18 నుంచి ఇది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ కానుంది.

44
ఒకే కేసు చుట్టూ మూడు సినిమాలు

ఇక `దృశ్యం 3` ఒక మర్డర్‌ కేసు చుట్టూ తిరుగుతుందనే విషయం తెలిసిందే. మొదటి భాగంలో ఒక పోలీస్‌ ఆఫీసర్‌ కొడుకు.. మోహన్‌ లాల్ కూతురితో అసభ్యంగా ప్రవర్తించడంతో అతనిపై దాడి చేస్తుంది. దీంతో అతను చనిపోతాడు. ఆ కేసు నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం హీరో చేసేని పోరాటం, ఎత్తులకు పై ఎత్తులే సినిమా. ఈ కేసు మీదనే ఇప్పుడు మూడు సినిమాలు వచ్చాయి. మూడో పార్ట్ లో మళ్లీ ఆ కేసుని తిరగతోడుతారు. బాధితుల పేరెంట్స్ ఒత్తిడి మేరకు పోలీసులు దాన్ని రీ ఓపెన్‌ చేస్తారు. అయినా ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు హీరో ఆడిన డ్రామానే మూవీ. అయితే మూడో పార్ట్ లో కేసు ఒప్పుకొని జైలుకెళ్లడం గమనార్హం. దీంతో ఈ సిరీస్‌ ఆగిపోతుందా? మళ్లీ కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories