Best Villain Roles: విలన్ల వల్లే హిట్ అయిన టాప్ 5 మూవీస్.. లిస్ట్ లో మహేష్, నాని, నితిన్, రాంచరణ్ సినిమాలు

Published : Jun 13, 2026, 04:00 PM IST

Best Villain Roles: విలన్ పాత్రలు బలంగా ఉండే టాలీవుడ్ సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ జాబితాలో మహేష్ బాబు, రాంచరణ్ లాంటి హీరోల చిత్రాలు ఉన్నాయి. 

PREV
16
Best Villain Roles

టాలీవుడ్ లో విలన్ పాత్రలు బలంగా ఉండే ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. మహేష్ బాబు, నితిన్, రాంచరణ్ లాంటి హీరోలు నటించిన సినిమాల్లో విలన్ ల పాత్రల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాబితాలో ఒక్కడు, ధ్రువ, అతడు లాంటి సినిమాలు ఉన్నాయి.

26
అతడు - సోనూసూద్

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అతడు' సినిమాలో సోనూసూద్ పోషించిన 'మల్లి' పాత్ర సినిమాకు పెద్ద టర్నింగ్ పాయింట్. హీరో స్నేహితుడిగా ఉంటూనే, డబ్బు కోసం నమ్మకద్రోహం చేసే ప్రొఫెషనల్ కిల్లర్‌గా ఆయన నటన అద్భుతం. క్లైమాక్స్‌లో మహేష్ బాబుకు, సోనూసూద్‌కు మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.

36
ధ్రువ - అరవింద్ స్వామి

ఒక విలన్ పాత్ర ఎలా ఉండాలో 'ధ్రువ' సినిమాలో అరవింద్ స్వామి చేసి చూపించారు. కేవలం భౌతిక బలం మాత్రమే కాకుండా, తెలివితేటలతో హీరోకి సవాల్ విసిరే విలన్ పాత్రలో ఆయన జీవించేశారు. ఈ సినిమా విజయంలో అరవింద్ స్వామి నటనదే ప్రధాన కారణం అని చెప్పవచ్చు.

46
ఈగ - కిచ్చా సుదీప్

రాజమౌళి సృష్టించిన ఈ అద్భుతమైన ఫాంటసీ చిత్రంలో విలన్ పాత్రే హైలైట్. కిచ్చా సుదీప్ తనదైన శైలిలో క్రూరత్వాన్ని, భయాన్ని పండించారు. విలన్ పాత్ర మీదనే మొత్తం కథ నడిచేలా చేసిన రాజమౌళి విజన్, దానికి తగ్గట్టుగా సుదీప్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలోప్రశంసలు దక్కేలా చేశాయి.

56
ఒక్కడు - ప్రకాష్ రాజ్

ఈ మూవీలో ప్రకాష్ రాజ్ పండించిన విలనిజంని ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు. ముఖ్యంగా త్రిషను ప్రేమించే పిచ్చి ప్రేమికుడిగా, మరోవైపు పవర్‌ఫుల్ విలన్‌గా ప్రకాష్ రాజ్ నటన ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిపింది.

66
సై - ప్రదీప్ రావత్

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'సై' చిత్రంలో ప్రదీప్ రావత్ పోషించిన 'భిక్షు యాదవ్' పాత్ర సినిమాకు ప్రధాన బలం. రగ్బీ ఆట నేపథ్యంలో సాగే ఈ సినిమాలో, హీరోని అడుగడుగునా అడ్డుకునే విలన్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు.

Read more Photos on
click me!

Recommended Stories