L2 Empuraan Movie
మలయాళం సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చే చిత్రాల్లో కంటెంట్ బలంగా ఉంటుంది అనే అభిప్రాయం అందరిలో ఉంది. ఇటీవల తెలుగు ఆడియన్స్ మలయాళీ ఓటీటీ డబ్బింగ్ చిత్రాలని విపరీతంగా ఆదరిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, టివినో థామస్ లాంటి నటులకు తెలుగులో కూడా గుర్తింపు ఉంది. దాదాపు ఐదేళ్ల క్రితం మలయాళంలో విడుదలైన లూసిఫెర్ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది.
L2E MohanLal
పొలిటికల్ థ్రిల్లర్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన లూసిఫెర్ లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు. పృథ్వీరాజ్ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని చిరంజీవి తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేయగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు లూసిఫెర్ చిత్రానికి పృథ్వీరాజ్ సీక్వెల్ తెరకెక్కించారు. ఎల్2 ఎంపురాన్ పేరుతో ఈ చిత్రం నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంలో టివినో థామస్, మంజు వారియర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
L2E MohanLal
డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఎల్ 2 చిత్రాన్ని మొదటి భాగం లూసిఫెర్ కంటే గ్రాండ్ గా భారీ బడ్జెట్ లో తెరకెక్కించారు. ట్రైలర్ లో యాక్షన్ విజువల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈసారి సుకుమారన్, మోహన్ లాల్ కలసి పొలిటికల్ థ్రిల్లర్ మాత్రమే కాదు యాక్షన్ విజువల్ వండర్ ని అందించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమైంది. మోహన్ లాల్ కెరీర్ లోనే ఈ చిత్రం రికార్డ్ స్థాయిలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. 50 కోట్ల ఓపెనింగ్ డే వసూళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. యుఎస్ లాంటి ప్రాంతాల్లో తాజాగా ఎల్2 ప్రీమియర్ షోలు పడ్డాయి. ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది, మూవీ చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ లో ఎలాంటి అభిప్రాయాలు పంచుకుంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.
L2E MohanLal
ఇండియన్ సినిమాలో బెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రాల్లో ఎల్ 2 ఎంపురాన్ ఒకటి అని ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రైలర్ చూపినట్లుగానే ఇందులో యాక్షన్ డోస్ పెంచారు. కానీ సన్నివేశాలు మాత్రం ఎంగేజింగ్ గా ఉన్నాయి. యాక్షన్ సీన్లు కూడా ఆకట్టుకుంటాయి. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాకి కావలసిన లుక్ ని డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ తన టేకింగ్ తో తీసుకువచ్చారు.
L2E MohanLal
ఈ చిత్రానికి ఎర్లీ టాక్ బావుండడంతో మోహన్ లాల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా మొదలు పెట్టారు. ఎల్2 చిత్రంలో క్లైమాక్స్ డిజైన్ అద్భుతంగా ఉందని అంటున్నారు. ఎలివేషన్ సీన్లు అదిరిపోయాయి. టివినో థామస్, మంజువారియర్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి దేశం మొత్తం ఆడియన్స్ కి నచ్చే అంశాలని సుకుమారన్ ఈ చిత్రంలో పొందుపరిచాట.
L2E MohanLal
దీపక్ దేవ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలని మరింతగా ఎలివేట్ చేస్తూ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కథ కాస్త నెమ్మదిగా మొదలు కావడమే మైనస్ అని చెబుతున్నారు. మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అయితే బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ లోడింగ్ అని ఆడియన్స్ అంటున్నారు.