ఆడియన్స్ టేస్ట్ మారింది. అలా అని పూర్తిగా బ్లేమ్ చేయను. సినిమాలపై వాళ్ళిచ్చే తీర్పు గమ్మత్తుగా ఉంటోంది. డబుల్ మీనింగ్ ఎక్కువగా కోరుకుంటున్నారు. కొన్ని సినిమాల్లో చెయ్యి అక్కడ వేశాను తీసెయ్యాలా, కాలు పైన వేశాను తీసేయమంటావా అనే సన్నివేశాలు ఎక్కువగా వస్తున్నాయి. మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు గమనిస్తే పరోక్షంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ పుష్ప చిత్రం గురించే అనిపిస్తుంది. పుష్ప చిత్రంలో అలాంటి సన్నివేశం ఉంది.