ఆ అమ్మాయితో నాకు చనువు ఉండేది. నాకు సైకిల్ తొక్కడం రాదు. వచ్చు కానీ ఎక్స్పర్ట్ ని కాదు. నాకు కూడా సైకిల్ నేర్పుతావా? అని, ఆ అమ్మాయిని అడిగేవాడిని. ఆ అమ్మాయి నాకు సైకిల్ నేర్పేది. నేను సైకిల్ తొక్కుతుంటే.. అమ్మాయి వెనుక పట్టుకునేది. నేనేమో సైకిల్ తొక్కుతూ ముందు చూడకుండా.. వెనక్కి తిరిగి ఆ అమ్మాయి ముఖం చూడటానికి ప్రయత్నం చేసేవాడిని.. ఆ అమ్మాయి ముందు చూడు, అనేది.
ఆమె పేరు చెప్పను కానీ.. తనే నా ఫస్ట్ లవ్'', అని చిరంజీవి తన రొమాంటిక్ లవ్ స్టోరీ చెప్పుకొచ్చాడు. పరిశ్రమకు రాకముందు చదువుకునే రోజుల్లో మొగల్తూరులో జరిగిన సంగతులు పంచుకున్నాడు. డిగ్రీ పూర్తి చేసిన చిరంజీవి, మద్రాస్ వెళ్లి నటనలో శిక్షణ తీసుకుంటూ ప్రయత్నాలు చేశాడు. ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ హీరో అయ్యాడు.