రాంచరణ్ ని సొంత బిడ్డలా భావించా, చిరంజీవి ఆ పని చేసి ఉంటే అడ్డు చెప్పేవాడిని కాదు.. మోహన్ బాబు కామెంట్స్

Published : May 30, 2025, 03:34 PM IST

చిరంజీవి, మోహన్ బాబు మధ్య విభేదాలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉంటాయి. గతంలో మా ఎన్నికల సందర్భంలో తలెత్తిన విభేదాల గురించి గురించి మోహన్ బాబు ఓపెన్ అయ్యారు.

PREV
15
మోహన్ బాబు, చిరంజీవి మధ్య విభేదాలు

మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు కుటుంబాల మధ్య తరచుగా విభేదాలు వస్తూనే ఉంటాయి. అనేక చిత్రాల్లో చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించినప్పటికీ వీళ్లిద్దరి మధ్య అంతగా సాన్నిహిత్యం లేదు. గతంలో జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల్లో ఎంత పెద్ద రభస జరిగిందో అందరికీ తెలిసిందే.

25
చిరంజీవి నాకు స్నేహితుడే

మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణుని మా ఎన్నికల పోటీలో నిలిపారు. చిరంజీవి మాత్రం ప్రకాష్ రాజ్ కి పరోక్షంగా సపోర్ట్ చేశారు. ఈ వ్యవహారం చిరంజీవి, మోహన్ బాబు మధ్య మనస్పర్ధలకు కారణం అయింది. ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు ఆ వివాదం గురించి ఓపెన్ గా కామెంట్స్ చేశారు. చిరంజీవి, మీరు స్నేహితులా, శత్రువులా అని ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించారు. మోహన్ బాబు సమాధానం ఇస్తూ స్నేహితులమే అని తెలిపారు. నేనైతే చిరంజీవిని స్నేహితుడనే అనుకుంటున్నాను అంటూ మెలిక పెట్టారు.

35
చిరంజీవి ప్రతిపాదనకు మోహన్ బాబు నో

తనకి అసలైన స్నేహితుడంటే రజనీకాంత్ అని తెలిపారు. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్న కారణంగా మంచు విష్ణు పోటీ నుంచి తప్పుకోవాలని చిరంజీవి మోహన్ బాబుని కోరారట. ఇది నిజమేనా అని ప్రశ్నిస్తే.. మోహన్ బాబు నిజమే కావచ్చు అని అన్నారు. చిరంజీవి అడిగిన దానికి నేను ఒప్పుకోకపోవడం కూడా నిజమే కావచ్చు అని మోహన్ బాబు అన్నారు.

45
అందుకే ఒప్పుకోలేదు

రాంచరణ్ ని నేను సొంత బిడ్డలా భావిస్తాను. మెగా ఫ్యామిలీలో అల్లు అరవింద్ పిల్లల్ని కూడా నా బిడ్డలుగా భావిస్తాను. నేను రాంచరణ్ ని మా ఎన్నికల్లో నిలబెడుతున్నాను.. కాబట్టి మంచు విష్ణు పోటీ నుంచి తప్పుకోవాలని చిరంజీవి అడిగి ఉంటే తప్పకుండా అంగీకారం తెలిపేవాడిని అని మోహన్ బాబు అన్నారు. కానీ ఇంకెవరి కోసమో అయితే ఒప్పుకోనని తేల్చి చెప్పేశారు. 

55
మా అధ్యక్షుడిగా మంచు విష్ణు 

ఆ ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించి మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అందువల్లే చిరంజీవి, మోహన్ బాబు మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయని అప్పట్లో ఇండస్ట్రీలో టాప్ నడిచింది.మోహన్ బాబు ఇచ్చిన క్లారిటీతో అది నిజమే అని తేలిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories