కానీ ఈ పెళ్లికి, ఈ సంబంధానికి ఆయన సుముఖంగా లేరు. తనకు చెప్పలేదనే కోపం ఆయనకు ఎక్కువగా ఉందని, తానంటే లెక్క లేదా అనే భావనలో ఉన్నారట. ఓ వైపు మంచులక్ష్మి, వాళ్ల బావ, ఇతర పెద్దలు, దాసరి చెప్పడంతో ఆలోచనలో పడ్డారట మోహన్‌బాబు. ఓ రోజు రాత్రి మంచు మనోజ్ వెళ్లి మోహన్‌బాబు గుండెలపై పడుకుని ఒప్పుకోవచ్చు కదా నాన్న, వదిన చాలా మంచిది అన్నాడట.
అంతే ఆ దెబ్బతో వాళ్లని పిలిపించమని చెప్పాడట. ఆ వెంటనే విరానిక ఫ్యామిలీ రావడం, సంబంధంఓకే చేయడం చేశారట. ఈ విషయాన్ని మంచు విష్ణు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే టాక్ షోలో తెలిపారు. 2006 నుంచి మూడేళ్లపాటు వీళ్ల ప్రేమ వ్యవహారం నడించింది. 2009లో మ్యారేజ్ చేసుకున్నారు. విరానికి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కజిన్ కూతురు కావడం విశేషం. మంచు విష్ణు, విరానికకి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.
read more: రమ్యకృష్ణ ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసా? నిజాలు బయటపెట్టిన కృష్ణవంశీ.. శివగామిలో తెలియని యాంగిల్