చిరంజీవి పిల్లలు నాకు కూడా బిడ్డలు లాంటి వారే. చిరంజీవి కొడుకుకానీ, అల్లు అరవింద్ కొడుకులు కానీ, నాగబాబు పిల్లలు కానీ, నాగార్జున పిల్లలు కానీ పోటీలో ఉంటే.. విష్ణుని వెంటనే పోటీ నుంచి తప్పుకోమని చెబుతా. మా చిరంజీవి అబ్బాయి ఏకగ్రీవంగా ఎన్నుకుందాం అని చెబుతా అంటూ మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా దూరం వచ్చేశాం అని మోహన్ బాబు అన్నారు.