బికినీలో లెజెండరీ డైరెక్టర్ మనవరాలు.. ముంబై వీధుల్లో సాక్షి సాగర్ చోప్రా సందడి.. వైరల్ పిక్స్

First Published | Jun 6, 2023, 1:23 PM IST

బాలీవుడ్ కు చెందిన ఒకప్పటి లెజెండరీ ఫిల్మ్ మేకర్ రామానంద్ సాగర్ మనవరాలు తాజాగా షాకింగ్ లుక్ లో కనిపించారు. ఏకంగా బికినీలో ముంబై వీధుల్లో సందడి చేయడం వైరల్ గా మారింది. 
 

80 చివరిలో, 90 ప్రారంభంలో ఐకానిక్ పౌరాణిక TV షో ‘రామాయణ్‌’ను రూపొందించడంలో పేరుగాంచిన రామానంద్ సాగర్ బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్నారు. దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఆయన సేవలకుగాను పద్మశ్రీ అవార్డు కూడా పొందారు. 2005లో మరణించారు. 
 

ఇదిలా ఉంటే.. రామానంద్ (Ramanand)  గ్రేట్ గ్రాండ్ డాటర్ అయిన సాక్షి సాగర్ చోప్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. ఈమె సింగర్ గా, మోడల్ గా ఇప్పుడిప్పుడే గుర్తింపు దక్కించుకుంటోంది. నెట్టింట మాత్రం సాక్షి హాట్ లుక్స్ లో మెరుస్తూ ఎప్పుడూ మతులు పోగొడుతుంది. 


అయితే మోడల్ గా కేరీర్ ను కొనసాగిస్తున్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు హాట్ లుక్స్ తో అదరగొడుతోంది. అంతేకాదు తన డ్రెస్సింగ్ తోనూ నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంటుంది. లెజెండరీ డైరెక్టర్ మనవరాలైన ఈమె ఇలా దర్శనమివ్వడం గమనార్హం. 

ఇక తాజాగా సాక్షి సాగర్ చోప్రా స్టన్నింగ్ లుక్ లో ముంబై వీధుల్లో దర్శనమిచ్చింది. బోల్డ్‌గా లుక్ తో అందరి మతులు పోగొట్టింది. ఆమె లుక్ మరోవైపు ఆకర్షణీయంగానూ మారింది. బికినీ లాంటి డ్రెస్ లో సాక్షి హాట్ బీట్ పెంచేసింది. 
 

ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియా కంటపడింది. ఫొటోలకూ ఫోజులిచ్చింది. తన లుక్ తో అందరినీ ఆకట్టుకుంది. ఆ వీడియోను కూడా తన అఫీషియల్ ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

ఇక సాక్షి చోప్రా యూట్యూబ్ ఛానెల్‌ని కూడా నడుపుతోంది తరచుగా బోల్డ్ లుక్‌లలో కనిపిస్తూ నెట్టింటిని బ్రేక్ చేస్తుంటుంది. ఇక ఆమె లండన్లోని ప్రతిష్టాత్మక ట్రినిటీ కాలేజీలో సంగీతంలో శిక్షణ పొందింది. యూట్యూబ్‌లో సాక్షి తొలి కవర్ సాంగ్ 'ఫీలింగ్ గుడ్' ఇటీవల విడుదలైంది. 
 

Latest Videos

click me!