ఖరీదైన బంగ్లాలు, లగ్జరీ హోటల్స్... మిథున్ చక్రవర్తి ఆస్తుల వివరాలు తెలిస్తే షాకే!

First Published Mar 8, 2021, 8:48 PM IST

నాలుగు దశాబ్దాలకు పైగా బాలీవుడ్ లో నటుడిగా కొనసాగుతున్నాడు నటుడు మిథున్ చక్రవర్తి. రాజకీయనాయకుడిగా కూడా పలు పార్టీలతో మిథున్ పనిచేశారు. ఇటీవలే మిథున్ అధికార బీజీపీ పార్టీలో చేరారు. ఇక త్వరలో జరగననున్న బెంగాల్ ఎన్నికలలో బీజేపీ తరపున ప్రచారం చేయనుకున్నాడు. మరోవైపు ఆయన బీజేపీ తరపున సీఎం అభ్యర్థి అంటూ వార్తలు వస్తున్నాయి. కాగా మిథున్ చక్రవర్తి ఆస్తుల వివరాలు షాక్ ఇచ్చేవిగా ఉన్నాయి. ముంబైతో పాటు పలు చోట్ల ఆయనకున్న భవనాలు, హోటల్స్ వివరాలు తెలిస్తే మతిపోవాల్సిందే. 
 

1960 జూన్ 16న కలకత్తాలో జన్మించిన మిథున్ చక్రవర్తి... ఎవరి అండా లేకుండానే స్వయంగా స్టార్ హీరోగా బాలీవుడ్ లో ఎదిగారు. కెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ చేసిన మిథున్... చదువు పూర్తయ్యాక నక్సలిజం పట్ల ఆకర్షితుడు అయ్యాడట. అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆ భావజాలాన్ని మిథున్ వదిలేశారట. ఇక మిథున్ ఆస్తుల వివరాలలోకి వెలితే... మిథున్ కి ఊటీలో విలాసవంతమైన బంగ్లా ఉంది.
undefined
మిథున్ ముంబై నివాసంలో 38 కుక్కలు ఉంటాయట. ఇక ఊటీ బంగ్లాలో 76కుక్కలు ఉన్నాయట. మొత్తంగా మిథున్ ఆస్తుల విలువ రూ. 256కోట్లని సమాచారం.
undefined
మిథున్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధికారిక సమాచారం ప్రకారం ఊటీ హోటల్ లో 59గదులు, 4 లగ్జరియస్ సూట్ రూమ్స్ ఉన్నాయట. స్విమ్మింగ్ పూల్, ఫిట్నెస్ సెంటర్, మిడ్ నైట్ కౌ బాయ్ బార్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఈ హోటల్ లో ఉన్నాయట.
undefined
మాసినగుడి మోనార్క్ సఫారీ పార్క్ నందు 16 బంగ్లాలు, మల్టీ కూసైన్ రెస్టారెంట్, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఉన్నాయట.
undefined
ఇక మైసూర్ లో ఉన్న హోటల్ నందు 18 ఏసీ కాటేజెస్, రెండు ఏసీ రూమ్స్, ఓపెన్ ఎయిర్ రెస్టారంట్, స్విమ్మింగ్ పూల్ కలిగి ఉందట.
undefined
ఇక మిథున్ కి కార్స్ కూడా ప్యాషన్ అట. టయోటా ఫార్చ్యూన్, ఫోర్డ్ వంటి కార్స్ తో పాటు 1975 రేర్ వీల్ డ్రైవ్ కార్ ఉందట. అప్పట్లో ఈ మోడల్ చాలా ఫేమస్ అట. అలాగే 1975 వోక్స్ వ్యాగన్ కార్ కూడా ఉందట.
undefined
1979లో మిథున్ హీరోయిన్ యోగితా బాలిని వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం. వారిలో అబ్బాయి మహాక్షే చక్రవర్తి హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
undefined
350కి పైగా చిత్రాలలో మిథున్ చక్రవర్తి నటించారు. డిస్కో డాన్సర్, అగ్నిపథ్, అశాంతి, ప్యార్ జుక్తా నహి వంటి అనేక హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.
undefined
click me!