రేవంత్ రెడ్డి ఇన్వైట్ చేసినా అల్లు అర్జున్ హ్యాండిచ్చారా ? సీఎంతో డిన్నర్ కి హాజరైన నాగార్జున..

Published : May 14, 2025, 07:43 AM ISTUpdated : May 14, 2025, 07:53 AM IST

హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకమైన 72వ మిస్ వరల్డ్ పోటీలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఇటీవల మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది.

PREV
16
రేవంత్ రెడ్డి ఇన్వైట్ చేసినా అల్లు అర్జున్ హ్యాండిచ్చారా ? సీఎంతో డిన్నర్ కి హాజరైన నాగార్జున..
Allu Aravind, Nagarjuna, CM Revanth Reddy

హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకమైన 72వ మిస్ వరల్డ్ పోటీలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఇటీవల మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. ఈ పోటీల్లో దాదాపు 110 దేశాలకు సంబంధించిన అందగత్తెలు పాల్గొంటున్నారు. మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ నగరం సందడిగా మారింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఇటీవల చార్మినార్ వద్ద సందడి చేశారు.

26
Miss World 2025

గత రాత్రి తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీదారులకు చౌమహల్లా ప్యాలెస్ లో పసందైన విందుని ఏర్పాటు చేసింది. ఈ విందుకి 110 దేశాలకు సంబంధించిన అందగత్తెలు, మిస్ వరల్డ్ నిర్వాహకులు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విందుకి టాలీవుడ్ ప్రముఖులను కూడా ఆహ్వానించారు. విశేషం ఏంటంటే మిస్ వరల్డ్ పోటీదారులకు ఏర్పాటు చేసిన విందుకి అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్ ఫ్యామిలీ లని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది.
 

36
Miss World 2025

స్వయంగా సీఎం ఇన్వైట్ చేయడంతో నాగార్జున, అల్లు అరవింద్ విందుకి హాజరయ్యారు. వీళ్ళిద్దరూ సీఎం రేవంత్ రెడ్డి తో ముచ్చటిస్తూ కనిపించారు. కొన్ని నెలల క్రితం తెలంగాణలో జరిగిన కొన్ని వివాదాస్పద సంఘటనల కారణంగా ఇటు అక్కినేని ఫ్యామిలీ, అటు అల్లు అరవింద్ ఫ్యామిలీ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసింది. దీనిపై నాగార్జున కోర్టులో పోరాటం చేస్తానని కూడా తెలిపారు.
 

46
Miss World 2025

ఇక అల్లు అరవింద్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటనలో పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ బెయిల్ పై విడుదలయ్యారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి, అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్య విభేదాలు గురించి ఆ టైంలో చర్చలు జరిగాయి. ఓ మీడియా సమావేశంలో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం కూడా చర్చనీయాంశమైంది.
 

56
Miss World 2025

అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి.. సినీ ప్రముఖులతో వివాదాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే నాగార్జున, అల్లు అరవింద్ ఫ్యామిలీ లని డిన్నర్ కి ఆహ్వానించారా అనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ని కూడా ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అల్లు అర్జున్ ఈ డిన్నర్ కి హాజరు కాలేదు. అల్లు అర్జున్ అందుబాటులో లేకపోవడం వల్లే డిన్నర్ కి హాజరు కాలేదని కొందరు చెబుతున్నారు. కానీ బన్నీ మరోసారి రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చారా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ అల్లు అరవింద్ హాజరై సీఎం రేవంత్ రెడ్డి తో సరదాగా మాట్లాడారు. దీంతో వీరి మధ్య వివాదాలు సమసిపోయినట్లే అని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
 

66
Revanth Reddy

మరోవైపు నాగార్జున కూడా రేవంత్ రెడ్డి తో డిన్నర్ లో కలిసి కూర్చున్నారు. వీరి మధ్య కూడా సరదాగా సంభాషణలు జరిగాయి. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. మొత్తంగా ఇకపై టాలీవుడ్ తో సీఎం రేవంత్ రెడ్డి ఆల్ హ్యాపీస్ అన్నట్లుగా వివాదాలకు ముగింపు పలికినట్లు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories