మిస్ యూనివర్స్ కి దక్కే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ? లగ్జరీ బెనిఫిట్స్ కూడా.. ఇండియా నుంచి ఫైనల్ కి ఎవరంటే

Published : Nov 20, 2025, 06:09 PM IST

మిస్ యూనివర్స్ 2025 గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం అయింది. థాయిలాండ్ లో మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతున్నాయి. ఇండియా తరుపున ఫైనల్ కి చేరుకున్నది ఎవరు ? విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంత ? లాంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
మిస్ యూనివర్స్ 2025

ప్రపంచ వ్యాప్తంగా జరిగే అందాల పోటీలలో మిస్ యూనివర్స్ పోటీలకు మంచి ప్రాముఖ్యత ఉంది. మిస్ యూనివర్స్ 2025 గ్రాండ్ ఫినాలేకి కౌంట్ డౌన్ మొదలైంది. మిస్ యూనివర్స్ పోటీలు థాయిలాండ్ లోని నొంతబూరిలో జరుగుతున్నాయి. గ్రాండ్ ఫినాలే ఈవెంట్ అట్టహాసంగా జరగనున్నాయి. నవంబర్ 21 శుక్రవారం రోజు గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇండియన్ టైం ప్రకారం ఉదయం 6.30 గంటలకు గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ప్రారంభం అవుతుంది. దీనితో 74వ మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకునేది ఎవరనే ఉత్కంఠ నెలకొంది. 

25
ఇండియా నుంచి ఫైనల్స్ కి రాజస్థాన్ మోడల్

ఈ పోటీల్లో 130 దేశాలకు చెందిన గ్లామర్ మోడల్స్ కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు. గత 19 రోజులుగా వీరంతా వివిధ రౌండ్లలో సత్తా చాటుతూ, ఇంటర్వ్యూలలో జడ్జీల హృదయాలు గెలుచుకుంటూ కొంతమంది మాత్రమే ఫైనల్స్ కి చేరుకున్నారు. ఇండియా తరపున రాజస్థాన్ కి చెందిన మణిక విశ్వకర్మ ఫైనల్స్ కి చేరుకుంది. ఈ ఏడాది మణిక విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా 2025 టైటిల్ గెలుచుకుంది. ఇప్పుడు ఆమె మిస్ యూనివర్స్ 2025 ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది.

35
మణిక వారి సరసన చేరుతుందా ?

మిస్ యూనివర్స్ టైటిల్ ఆమె గెలిస్తే.. ఆ ఘనత సాధించిన నాల్గవ భారతీయ మహిళగా మణిక చరిత్ర సృష్టిస్తుంది. గతంలో సుష్మితా సేన్, లారా దత్తా, హర్నాజ్ సంధు ఈ ఘనత సాధించారు. జడ్జెస్ ప్యానల్ లో మాజీ మిస్ యూనివర్స్ లు డయానారా టోర్రెస్, బిన్నీ గాబ్రియేల్ కమెడియన్ స్టీవ్ బ్రయాన్ లాంటి వారు ఉన్నారు. 

45
స్విమ్ సూట్ లో మెరిసిన మణిక 

మణిక విశ్వకర్మ మిస్ యూనివర్స్ పోటీల్లో భాగంగా బ్లూ కలర్ స్విమ్ సూట్ లో మెరుపులు మెరిపించింది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. థాయిలాండ్ లో నాల్గవసారి మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతున్నాయి.

55
విజేతకు దక్కే ప్రైజ్ మనీ, లగ్జరీ బెనిఫిట్స్ ఇవే 

మిస్ యూనివర్స్ 2025 కిరీటం గెలిచిన కంటెస్టెంట్ కి అందించే ప్రైజ్ మనీ గురించి స్పష్టమైన వివరాలు లేవు. కానీ అందుతున్న సమాచారం మేరకు విజేతకు 250000 డాలర్లు (దాదాపు రూ. 2.21 కోట్లు) ప్రైజ్ మనీగా దక్కే అవకాశం ఉంది.  ప్రైజ్ మనీతో పాటు మరిన్ని లగ్జరీ బెనిఫిట్స్ ఉంటాయి. వివిధ బ్రాండ్స్ కి ఎండార్మెంట్స్ చేసే అవకాశం దక్కుతుంది. న్యూయార్క్ లాంటి నగరాల్లో లగ్జరీ ఫ్లాట్ కూడా దక్కుతుందట. అదే విధంగా స్కాలర్ షిప్ కూడా లభిస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories