
Mirai First Review: ‘హనుమాన్’ మూవీ తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు యంగ్ హీరో తేజ సజ్జ. అతి త్వరలో ‘మిరాయ్’(Mirai) అనే మరో యాక్షన్ అడ్వెంచర్ అండ్ ఫాంటసీ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో తేజ సజ్జా సూపర్ పవర్స్ కలిగిన యోధుడి పాత్రలో కనిపించగా, విలక్షణ నటుడు మంచు మనోజ్ విలన్ పాత్రలో బ్లాక్ స్వర్డ్ అనే ప్రత్యేకమైన రోల్‌లో ఆకట్టుకోనున్నాడు.
‘మిరాయ్’(Mirai) సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. పాపులర్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ యాక్షన్ అడ్వెంచర్ అండ్ ఫాంటసీ థ్రిల్లర్ తెరక్కెకింది.
యాక్షన్ అడ్వెంచర్ అండ్ ఫాంటసీ థ్రిల్లర్ లో తేజా సజ్జా హీరోగా, రితిక నాయక్ హీరోయిన్ గా నటించారు. అలాగే మంచు మనోజ్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఇక సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీయ, జగపతి బాబు, జయరామ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ పురాణాల ఆధారంగా సోషల్ ఫాంటసీ సినిమాకు కృతి ప్రసాద్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్లతోనే బోలెడంత క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీ సెప్టెంబర్ 12న పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వర్డల్ వైడ్ గా విడుదల కాబోతుంది.
ఇటీవల మిరాయ్ మూవీ (Mirai)సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అధికారులు ఈ సినిమాను వీక్షించిన అనంతరం పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రంలో తేజ సజ్జా అద్వితీయమైన శక్తులున్న ఓ యోధుడి పాత్రలో కనిపించగా, మంచు మనోజ్ విలన్ పాత్రలో బ్లాక్ స్వర్డ్ అనే ప్రత్యేకమైన పాత్రలో అలరించబోతున్నారు. ముఖ్యంగా మనోజ్ విలన్ ఎంట్రీ సీన్‌ను బాగా డిజైన్ చేశారని, అతను కనిపించే ప్రతిసారీ మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వర్కౌట్ అయ్యిందని సెన్సార్ అధికారులు అభిప్రాయం తెలిపారు.
ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A (16+) సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే 16 ఏళ్లు నిండిన యువతీ యువకులు పెద్దల పర్యవేక్షణలో ఈ సినిమాను వీక్షించవచ్చని అర్థం. ఈ సినిమాకు ఏ ఒక్క కత్తిరింపులు సూచించకుండా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయడం మరో విశేషం. ‘మిరాయ్’మూవీ నిడివి 2 గంటల 49 నిమిషాలు (169 నిమిషాలు) గా ఫిక్స్ చేశారు. స్కీన్ ప్లేలో ఎలాంటి లాగ్ లేకుండా, ఫాస్ట్-పేస్‌లో నడుస్తుందని, క్లైమాక్స్‌లో శ్రీరాముని ఎపిసోడ్ మాత్రం అద్భుతంగా డిజైన్ అయిందని సెన్సార్ అధికారులు పేర్కొన్నారు.
మిరాయి సినిమాకు గ్రాఫిక్స్ ప్రధాన బలమని సెన్సార్ బోర్డు అధికారుల అభిప్రాయం. తక్కువ బడ్జెట్‌లోనే అద్భుతమైన విజువల్స్ వాడటం ద్వారా ఈ సినిమాను విజువల్ వండర్‌లా తీర్చిదిద్దారని చెప్పారు. హీరోయిన్‌గా రితికా నాయక్ నటిస్తుండగా, సీనియర్ నటి శ్రీయా శరణ్ తొలిసారి తల్లి పాత్రలో కనిపించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఆమె గ్లామర్, నటన కలిపి సినిమాకు ప్లస్ అవుతుందని సెన్సార్ సభ్యులు అభిప్రాయపడ్డారు.
ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కార్తీక్ ఘట్టమనేని, గతంలో సినిమాటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న తరువాత ‘సూర్య వర్సెస్ సూర్య’, ‘ఈగల్’ చిత్రాలను తెరకెక్కించారు. ఈసారి పూర్తి థ్రిల్లింగ్ స్క్రిప్ట్‌తో వచ్చారని, కథా కథనాలు క్లారిటీతో ఉన్నాయని సెన్సార్ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా విలన్ క్యారెక్టరైజేషన్ బాగా నడిపించారని, ఇది మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్‌కి బలమైన అడ్వాంటేజ్ అవుతుందని చెప్పారు.
‘హనుమాన్’ మూవీతో రూ.300 కోట్ల భారీ విజయాన్ని అందుకున్న తేజ సజ్జా నుంచి ఆడియెన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ట్రైలర్, టీజర్ దశలోనే క్రేజ్ క్రియేట్ చేసిన ‘మిరాయ్’ ఇప్పటికే విడుదలకు ముందే మంచి బిజినెస్ సాధించింది. సెన్సార్ ఫీడ్‌బ్యాక్ పాజిటివ్‌గా రావడంతో, సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని సినీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.